బాబు టార్గెట్ వీరిద్దరూ ఎందుకయ్యారంటే?

అధికారంలో లేకపోతే చంద్రబాబు ఊరికే ఉండరు. నిరంతరం అధికార పార్టీపై విరుచుకుపడుతూనే ఉంటారు. అది సహజమే. విపక్షం లక్షణం కూడా. కానీ తనకు గిట్టని వారిని మాత్రం [more]

Update: 2020-11-07 13:30 GMT

అధికారంలో లేకపోతే చంద్రబాబు ఊరికే ఉండరు. నిరంతరం అధికార పార్టీపై విరుచుకుపడుతూనే ఉంటారు. అది సహజమే. విపక్షం లక్షణం కూడా. కానీ తనకు గిట్టని వారిని మాత్రం చంద్రబాబు ఊరికే వదిలిపెట్టరు. వారు ఏ పార్టీలో ఉన్నా వారిని బద్నాం చేసేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. తన అనుకూల మీడియా ద్వారా వారిపై బురదజల్లే కార్యక్రమం మొదలుపెడుతుంటారు. ఇప్పుడు కొందరు బీజేపీ నేతలు కూడా ఎల్లో మీడియా దెబ్బకు విలవిలలాడిపోతున్నారు.

బీజేపీ చెంతకు చేరకుండా…..

ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ బీజేపీ నేతలు సునీల్ దేవధర్, జీవీఎల్ నరసింహారావులు. వారిద్దరూ తమను బీజేేపీ పెద్దల చెంతకు చేరకుండా అడ్డుకుంటున్నారన్నది టీడీపీ అనుమానం. అనుమానం కాదు. నిజమే అయి ఉండవచ్చు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు మోదీని తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టడం, దేశ వ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా పర్యటిస్తానని చెప్పడం, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడం వంటి కారణాలతో చంద్రబాబును తిరిగి బీజేపీ చెంత చేర్చుకోకూడదనే వారిలో వీరిద్దరూ ప్రముఖంగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరుసటి రోజు నుంచే….

నిజానికి చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నేతలతో కూడా ఆయన రహస్య మంతనాలు జరిపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆర్ఎస్ఎస్ నేతలు చంద్రబాబు పట్ల కొంత సానుకూలంగా ఉన్నా ప్రముఖంగా వీరిద్దరూ గట్టిగా అడ్డుపడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి నుంచి తొలగించి సోము వీర్రాజు నియామకంలోనూ వీరిద్దరి పాత్ర ప్రముఖంగానే ఉంది. దీంతో ఇప్పుడు టీడీపీికి సునల్ దేవధర్, జీవీఎల్ నరిసింహారావు టార్గెట్ అయ్యారు.

వ్యతిరేక ప్రచారం…..

ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియాలో జీవీఎల్ నరసింహారావు జగన్ బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ బంధువంటూ తొలుత ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీనిని జీవీఎల్ తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు తాజాగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయంలో వీరిద్దరూ కలసి జగన్ కు లబ్దిచేకూర్చేలలా అభ్యర్థిని నిర్ణయించినట్లు ఎల్లో మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో పోటీ చేస్తామని తొలుత ప్రకటించింది బీజేపీనే. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించి ఇప్పుడు టీడీపీ మీడియా వీరిద్దరిని టార్గెట్ చేసింది. వీరిద్దరూ జగన్ నుంచి లబ్ది పొందుతున్నారన్న ప్రచారానికి దిగింది. మొత్తం మీద చంద్రబాబుకు ఆయన పార్టీకి జీవీఎల్, సునీల్ దేవధర్ టార్గెట్ అయ్యారనే చెప్పాలి.

Tags:    

Similar News