బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు నివాసం కూల్చివేత

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసాన్ని సీఆర్డీఏ సిబ్బంది కూల్చివేస్తున్నారు. కృష్ణానది కరకట్టమీద ఉన్న చంద్రబాబు నివాసంతో పాటు మరికొన్ని కట్టడాలను కూడా సీఆర్డీఏ కూల్చి వేత పనులను [more]

Update: 2019-09-23 03:23 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసాన్ని సీఆర్డీఏ సిబ్బంది కూల్చివేస్తున్నారు. కృష్ణానది కరకట్టమీద ఉన్న చంద్రబాబు నివాసంతో పాటు మరికొన్ని కట్టడాలను కూడా సీఆర్డీఏ కూల్చి వేత పనులను ప్రారంభించింది. మూడు రోజుల క్రితమే చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉన్న ఇంటిలో కొన్ని అక్రమ కట్టడాలను సీఆర్డీఏ గుర్తించింది. బాబు నివాసంలో ఉన్న కొన్ని అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను సీఆర్డీఏ ప్రారంభించింది. బాబు నివాసంలోని స్విమ్మింగ్ పూల్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్, బెడ్ రూమ్ లను కూల్చివేస్తుంది. ఈ నివాసం ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ది. ప్రొక్లెయినర్లతో చంద్రబాబు నివాసం కూల్చివేత పనులను సీఆర్డీఏ ప్రారంభించింది.

Tags:    

Similar News