అజెండా సెట్ చేస్తున్న బాబు…జగన్ రెడీనా ?

చంద్రబాబునాయుడుని అందుకే రాజకీయ గండరగండడు అని పిలిచేది. ఆయన మార్క్ పాలిటిక్స్ ఈ తరంలో ఎవరూ చేయరు, చేయలేరు కూడా. చంద్రబాబు ఎంతటి మేధావి అంటే సరిగ్గా [more]

Update: 2020-10-30 14:30 GMT

చంద్రబాబునాయుడుని అందుకే రాజకీయ గండరగండడు అని పిలిచేది. ఆయన మార్క్ పాలిటిక్స్ ఈ తరంలో ఎవరూ చేయరు, చేయలేరు కూడా. చంద్రబాబు ఎంతటి మేధావి అంటే సరిగ్గా ఏడాది క్రితం జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించారు. జాగ్రత్తగా చట్టంగా కూడా చేసుకున్నారు కానీ మూడు రాజధానుల మీద అడుగు ఒక్కటి కూడా ముందుకు వేయలేకపోయారు. చంద్రబాబు మ్యానుపలేటర్, వ్యవస్థలను మ్యానేజ్ చేస్తారు ఇలా ఎన్ని వైసీపీ నేతలు చెప్పుకున్నా కూడా ఇపుడు జగన్ దూకుడుకి ఆయన ఒక్కసారిగా బ్రేకులు వేసేశారు. అంటే విజయవంతంగా ఒక ఏడాది కాలం వేస్ట్ చేశారన్నమాట.

అదే నినాదమా…?

చంద్రబాబు ఒక్క మాట అంటున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ మూడు రాజధానుల విషయం చెప్పలేదని, అలా కనుక చెప్పి ఉంటే ఆయన పార్టీ ఓడిపోయేది అని కూడా చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. దానికోసం అసెంబ్లీని రద్దు చేసి మరీ ఎన్నికలకు వెళ్లమన్నది కూడా బాబే. కానీ వైసీపీ ఆ డిమాండ్ ని లైట్ గా తీసుకుంది. పైగా మీరే ఎన్నికలకు వెళ్ళండి అంటూ సలహా ఇచ్చింది. ఇక ఎన్నికలకు ఎవరూ వెళ్ళరని తేలిపోయింది. కానీ ఎన్నికల దాకా అమారావతి వేడిని రగిల్చి దాన్ని నినాదంగా చేయాలన్న చంద్రబాబు వ్యూహం మాత్రం అలాగే కొనసాగుతోంది.

జమిలి మీద ఆశలు…..

భగవంతుడు కరుణించి జమిలి ఎన్నికలు కనుక 2022లో వస్తే చంద్రబాబు అప్పటిదాకా అమరావతి వేడిని రగల్చడం పెద్ద కష్టం కాబోదు. హైకోర్టులో రాజధాని మీద రోజు వారీ విచారణ జరిగి ఇక్కడ తీర్పు జగన్ కి అనుకూలంగా వచ్చినా సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు కూడా చంద్రబాబు మనుషులు రెడీగా ఉన్నారు. దాంతో 2021 ని అలా పూర్తిగా వాడుకుంటే 2022లో ఎటూ జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి. అపుడు అమరావతి ఏకైక రాజధాని అంటూ చంద్రబాబు ప్రజల వద్దలు వెళ్తారని అంటున్నారు. ఈ లోగా మూడు రాజధానుల విషయంలో ఒక్క అడుగూ జగన్ వేయకుండా తొక్కిపెట్టి ఉంచి చేయాల్సినదంతా చేస్తారన్న మాట.

ఇరకాటమేనా ….?

ఇప్పటికే ఏపీలో అభివృద్ధి జరగడంలేదని, ఒక్క ఇటుక కూడా పడలేదు అంటూ చంద్రబాబు అండ్ కో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాముంటే ఎంతోకొంత అభివృద్ధి చేసేవారని కూడా చెప్పుకుంటోంది. తాము చేసిన అభివృద్ధి ఫలితంగానే జగన్ ఇపుడు అసెంబ్లీని పెట్టగలుస్తున్నారని, సచివాలయాన్ని వాడుకుంటున్నారని, హైకోర్టు కూడా తాము కట్టిందేనని కూడా తమ్ముళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా అభివృద్ద్ధి అమరావతి అంటూ జనంలోకి వెళ్ళాలని టీడీపీ స్కెచ్ గీసుకుందని చెబుతున్నారు. అదే కనుక జరిగితే కేవలం పంచుడు కార్యక్రమాలతోనే వైసీపీ వచ్చే ఎన్నికల్లో గట్టెక్కగలదా అన్నది ఒక చర్చగా ఉంది. మరి మూడు రాజధానుల సంగతిని పక్కన పెట్టి రానున్న కాలంలో అభివృద్ధి కోసమైనా వైసీపీ అడుగులు ముందుకు వేయకపోతే జమిలి ఎన్నికలు ముంచుకు వస్తే చిక్కులు తప్పవని అంటున్నారు.

Tags:    

Similar News