చంద్ర‌బాబు యూట‌ర్నే ఆయ‌న లైఫ్‌ను ట‌ర్న్ చేసిందా ?

ఏపీలో చంద్రబాబు నాయుడు ప్ర‌భుత్వం ఓట‌మి పాల‌వ‌డానికి ఉన్న కార‌ణాల్లో ముఖ్య‌మైన‌ది.. యూట‌ర్న్ తీసుకోవ‌డం! అవును! టీడీపీ పార్టీ అధినేత‌, సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంద‌ర్భాల్లో.. [more]

Update: 2019-06-18 18:29 GMT

ఏపీలో చంద్రబాబు నాయుడు ప్ర‌భుత్వం ఓట‌మి పాల‌వ‌డానికి ఉన్న కార‌ణాల్లో ముఖ్య‌మైన‌ది.. యూట‌ర్న్ తీసుకోవ‌డం! అవును! టీడీపీ పార్టీ అధినేత‌, సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంద‌ర్భాల్లో.. అనేక విష‌యాల్లో యూట‌ర్న్ తీసుకున్నారు. ముఖ్యంగా ప్ర‌జ‌లు ఎంతో ఉత్కంఠ‌తో, ఆశ‌తో ఎదురు చూసిన ప్ర‌త్యేక హోదా విష‌యం కానీ, హైద‌రాబాద్ రాజ‌ధానిగా ప‌దేళ్ల‌పాటు సాగించాల్సిన పాల‌న విష‌యంలో కానీ, ఆస్తుల విష‌యంలో కానీ చంద్ర‌బాబు యూటర్న్ తీసుకున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న యూట‌ర్న్ తీసుకుని మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా ఏపీకి జీవ‌నాడి వంటిద‌ని తెలిసిన ఆయ‌న ఇదేమీ సంజీవ‌ని కాదంటూ.. చేసిన ప్ర‌క‌ట‌న నుంచి హోదా అంటే ఏంటో బ్రీఫ్ చేయండి.. అన‌డం వ‌ర‌కు ప్ర‌జ‌లు గ‌మ‌నించారు.

అదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎందుకు ఇవ్వ‌రు? అని ప్ర‌శ్నించ‌డాన్ని కూడా బాబు విష‌యంలో ప్ర‌జ‌లు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇదేనా అనుభ‌వం అంటే? అని ప్ర‌శ్నించుకున్నారు. ఇక‌, త‌న కుమారుడు లోకేష్‌ను దొడ్డిదారి గుండా మంత్రి ని చేయ‌డాన్ని మెజారిటీ మేధావులు, ప్ర‌జ‌లు కూడా జీర్ణించుకోలేక పోయారు. లోకేష్‌కు ఇన్ని ప‌ద‌వులా? అని చ‌ర్చించుకున్నారు. అదేస‌మ‌యంలో అధికారుల‌ను, అన్ని వ్య‌వ‌స్త‌ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని, ప్ర‌జ‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డాన్ని కూడా ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోయారు.

సంతృప్తి..80%, 85% అంటూ లేనిపోని లెక్క‌లు చెప్ప‌డాన్ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌తి ప్ర‌భుత్వ ప‌నికీ.. లంచాలు ఇవ్వాల్సి రావ‌డం, రెవెన్యూ కార్యాల‌యాలు వ‌సూళ్ల కేంద్రాలుగా, నిలువు దోపిడీ సంస్థ‌లుగా మారిపోవ‌డాన్ని ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోయారు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని చెప్పుకొన్నా.. అవి క్షేత్ర‌స్థాయిలో కేవలం టీడీపీకి చెందిన వారికే అంద‌డాన్ని ప్ర‌జ‌లు మ‌రిచిపోలేక పోయారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం వైసీపీని అస‌లు పార్టీగా కూడా గుర్తించ‌క‌పోవ‌డం, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను 23మందిని చంద్ర‌బాబు త‌న బ్యాచ్‌లో క‌లుపుకోవ‌డం వంటివి భారీ మైన‌స్‌.

ఇక, మ‌రో కీల‌క విష‌యం.. రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉంద‌ని, జీతాలు ఇచ్చేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నా మ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ద‌ర్పాన్ని ఎక్క‌డా త‌గ్గించుకోలేదు, ధ‌ర్మ పోరాట దీక్ష‌లు, ప్ర‌తిజ్ఞ‌ల, పోల‌వ‌రం సంద‌ర్శ‌న‌, అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌ల పేరుతో విచ్చ‌ల‌విడిగా ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేయ‌డంపై ప్ర‌జ‌లు క‌న్నెర్ర చేశారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న మంత్రుల‌పైకానీ, భూక‌బ్జాల్లో పేరు వినిపించిన బొండా వంటి ఎమ్మెల్యేల‌పై కానీ చ‌ర్య‌లు తీసుకోలేదు.

ఒక‌ప్పుడు టీడీపీలో పార్టీ అధినేత‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య చెక్కు చెద‌ర‌ని రిలేష‌న్ ఉండేది. ఈ సారి ఎమ్మెల్యేలు, మంత్రులు కార్య‌క‌ర్త‌ల‌కు, బాబుకు మ‌ధ్య బాగా దూరం పెంచేశారు. క్షేత్ర‌స్థాయిలో త‌మ‌ను ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోక‌పోతే వారి గోడును ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌ని ప‌రిస్థితి. ఎన్నిక‌ల్లో వీరు కూడా ఎమ్మెల్యేల ఓట‌మికి ప్ర‌ధాన కార‌కులుగా మారారు. దీంతో ప్ర‌జ‌లు విసుగెత్తి.. ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వం మాకు అవ‌స‌రం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మ‌రి ఇవ‌న్నీ కూడా చంద్రబాబు నాయుడు కు క‌నిపించ‌లేదంటే.. ఏమ‌నాలి?!

Tags:    

Similar News