తిరుపతి… పరపతి పోతుందిటగా ?

అదేంటో ఏపీలోని విపక్షం తీరు కడు విచిత్రంగా ఉంది. ఎక్కడైనా ఎన్నికలు అంటే ముందుగా ఎగిరి గంతేసేది విపక్షమే. అంతెందుకు తెల్లారిలేస్తే జమిలి ఎన్నికల గురించే జూమ్ [more]

Update: 2020-10-05 06:55 GMT

అదేంటో ఏపీలోని విపక్షం తీరు కడు విచిత్రంగా ఉంది. ఎక్కడైనా ఎన్నికలు అంటే ముందుగా ఎగిరి గంతేసేది విపక్షమే. అంతెందుకు తెల్లారిలేస్తే జమిలి ఎన్నికల గురించే జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు క్యాడర్ కి ఊదరగొడతారు. అలాంటిది ఇపుడు అనూహ్యంగా తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వచ్చిపడింది. దాన్ని ఎలా తప్పించుకోవాలా అని బాబు సహా విపక్షాలంతా ఇపుడు ఆలోచిస్తున్నాయట. ఈ ఎన్నికలలో పోటీ చేయాలని ఎవరికీ ఇష్టమే లేదుట. దానికి కారణం ఏపీలో వైసీపీ గట్టిగా ఉండడమే.

గ్రౌండ్ రియాలిటీ ఇదే :

నిజానికి మొదట్లో చంద్రబాబుకు తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. కానీ అక్కడ సీన్ చూస్తే రివర్స్ లో ఉంది. మొత్తానికి మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు కూడా వైసీపీ ఎమ్మెల్యేల చేతిల్లోనే ఉన్నాయి. పైగా గత ఏడాది బల్లి దుర్గాప్రసాద్ అలా ఇలా గెలవలేదు, ఏకంగా రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. దాంతో పాటు ఈ ఏడాదిన్నరలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్ అమలు చేశారు. ఇక కరోనా కారణంగా దుర్గా ప్రసాద్ బలి అయ్యారు. ఆయన మంచివాడు, కరోనా తీసుకెళ్ళిపోయింది అన్న సానుభూతి ఎటూ జనంలో ఉంది. ఇవన్నీ కలసి వైసీపీకి ఎదురులేని పరిస్థితిని కల్పిస్తున్నాయి.

అయిననూ ఇబ్బంది పెట్టవలె :

సరే ఇవన్నీ ఇలా ఉన్నా కూడా చంద్రబాబు జగన్ కి ఊరికే ఎంపీ సీటు ఉదారంగా ఎందుకు ఇచ్చేయాలన్న ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. కానీ ఆయన బయటపడరు, పోటీకి దిగరు, దిగితే సీన్ ఏంటో కచ్చితంగా తెలుసు. అందుకే బీజేపీని దువ్వుతున్నారని టాక్. బీజేపీ పోటీ చేస్తే వెనక నుంచి మద్దతు ఇస్తారట. బయటకు మాత్రం దుర్గాప్రసాద్ మీద సానుభూతితో పోటీ పెట్టడంలేదని కలరింగు ఇచ్చుకుంటారట. అంటే పగిలితే బీజేపీ ముక్కే పగలాలి. తాను మాత్రం సేఫ్ జోన్ లో ఉండి జగన్ కి ఉప ఎన్నిక తలనొప్పి కలిగించాలన్నది బాబు మార్క్ ప్లాన్ అంటున్నారు.

పోయేది పరువేగా :

ఇక బీజేపీ, జనసేన కూటమి పోటీకి దిగితే కచ్చితంగా పరువు పోతుందని అంటున్నారు. నిజానికి ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం సోము వీర్రాజు కూడా ఇష్టం లేదుట. కచ్చితంగా ఓడిపోయే సీటు అని తెలిసి పోటీకి దిగడం అంటే భవిష్యత్తు ఆశలను, అంచనాలను నిలువునా సమాధి చేసుకోవడమేనని అంటున్నారు. పైగా టీడీపీ అతి తెలివి చూపించి బరి నుంచి తప్పుకుని బీజేపీని బలి పశువు చేయాలని ఆడే రాజకీయ క్రీడను కూడా కమలనాధులు గమనిస్తున్నారు. అసలు బాబు మద్దతు మనకెందుకు అన్న ఆలోచన కూడా పార్టీలో ఉందిట. ఇక సానుభూతితో పాటు, జగన్ ఇమేజ్, అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఇవన్నీ కలసి కచ్చితంగా వైసీపీకే ఎడ్జి ఉన్నపుడు పోటీ చేయడం వల్ల రాజకీయ నష్టమే తప్ప లాభం లేదని కమలం పార్టీ అంచనాకు వస్తోందిట. మొత్తానికి ఏపీలో అంతా కలసి ఈ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకునేలాగే సీన్ ఉందని అంటున్నారు.

Tags:    

Similar News