జ‌గ‌న్ ఎఫెక్ట్.. బాబు ముందున్న ఆప్షన్ అదేనా…?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యల కార‌ణంగా తాను బోనులో ఇరుక్కోక త‌ప్పద‌ని భావిస్తున్నారు మాజీ సీఎం చంద్రబాబు. పోల‌వ‌రం, విద్యుత్ ఒప్పందాలు స‌హా వివిధ అంశాల్లో [more]

Update: 2019-07-21 12:30 GMT

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యల కార‌ణంగా తాను బోనులో ఇరుక్కోక త‌ప్పద‌ని భావిస్తున్నారు మాజీ సీఎం చంద్రబాబు. పోల‌వ‌రం, విద్యుత్ ఒప్పందాలు స‌హా వివిధ అంశాల్లో భారీ కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని ఆరోపిస్తున్న జ‌గ‌న్‌.. వీటి అంతు చూసేందుకు ముఖ్యంగా చంద్రబాబును బోనులో ఎక్కించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలో త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు బీజేపీకి మ‌ళ్లీ చంద్రబాబు జై కొడ‌తారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. విష‌యం లోకి వెళ్తే.. ఏపీలో ఎన్నడూ చూడ‌ని విధంగా రాజ‌కీయ ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

బాబును టార్గెట్ చేస్తూ….

రాజ‌కీయాల్లో శ‌త్రువులు ఉండ‌రు.. కేవ‌లం ప్రత్యర్థులే ఉంటార‌నే నానుడిని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చెరిపివేస్తోంది. రాజ‌కీయాల్లో కేవ‌లం శ‌త్రువులు మాత్రమే ఉంటారు! అనే విధంగా అసెంబ్లీలో టీడీపీని, చంద్రబాబును, ఆయ‌న పాల‌న‌ను పూర్తిగా టార్గెట్ చేస్తోంది. సౌర‌, ప‌వ‌న‌ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాల నుంచి పోల‌వ‌రం ప‌నులు, అమ‌రావ‌తి భూ స‌మీక‌ర‌ణ‌, న‌దుల వెంబ‌డి నిర్మాణాలు, ఇసుక మాఫియా, టెండ‌ర్లు.. ఇలా అన్ని రూపాల్లోనూ చంద్రబాబును ఇరుకున పెట్టి.. ఎట్టి ప‌రిస్థితిలోనూ చంద్రబాబును జైలుకు పంపాల‌నేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో అత్యంత త‌క్కువ సంఖ్యాబ‌లం ఉన్న చంద్రబాబు త‌న‌ను తాను ర‌క్షించుకుంటూనే పార్టీని కాపాడాలి.

కమలం పార్టీకి దగ్గరవుతూ….

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. చిన్నబాబుకు పార్టీ ప‌గ్గాలు అప్పగించాలి. ఇన్ని బాధ్యత‌లు ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు జ‌గ‌న్ చేతిలో చిక్కివిల‌విల్లాడే కంటే.. వేరే మార్గం చూసుకుని త‌ప్పించుకోవ‌డంలోనే ఆనందం ఉంద‌ని గుర్తించిన‌ట్టు స‌మాచారం. ఈ క్రమంలోనే ఆయ‌న త‌న పాత మిత్రపక్షం బీజేపీతో చేతులు క‌ల‌పాల‌ని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. గ‌తంలో ఉన్న వైరాన్ని ప‌క్కన‌పెట్టాల‌ని ఇప్పటికే చంద్రబాబు.. త‌న 'ఆప్తమిత్రుల' ద్వారా బీజేపీకి స‌మాచారం అందుతోంది.

వర్తమానం పంపి….

గ‌తంలో తాను బీజేపీని, న‌రేంద్ర మోడీ పట్ల చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగ‌తం కావ‌ని, రాజ‌కీయ కోణంలోనే చూడాల‌ని చంద్రబాబు అభ్యర్థించిన‌ట్టు తెలుస్తోంది. మీరు నాకు స‌హ‌క‌రిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో క‌ల‌సిముందుకు సాగుతామ‌ని, జాతీయ స్థాయిలో తాను కూడా సాయం చేస్తాన‌ని చంద్రబాబు ఇప్పటికే కేంద్రంలోని పెద్దల‌కు వ‌ర్తమానం పంపార‌ట‌. దీనిపై క‌మ‌ల నాథులు సానుకూలంగానే స్పందించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇదే జ‌రిగితే.. చంద్రబాబుకు కొంతలో కొంత ఊరట లభిస్తుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News