జ‌గ‌న్ వ్యూహం.. ప్రతివ్యూహంలో బాబు ఫెయిల‌వుతున్నారా…?

విష‌యం ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ వేసే ఎత్తుగ‌డ‌ల‌కు ప్రతిప‌క్షంలో ఉన్న నాయ‌కులు ప్రతివ్యూహంతో దాడులు చేయ‌డం అనేది ఎక్కడైనా క‌నిపించేదే. అయితే, ఈ విష‌యంలో ఏపీలో [more]

Update: 2020-02-29 13:30 GMT

విష‌యం ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ వేసే ఎత్తుగ‌డ‌ల‌కు ప్రతిప‌క్షంలో ఉన్న నాయ‌కులు ప్రతివ్యూహంతో దాడులు చేయ‌డం అనేది ఎక్కడైనా క‌నిపించేదే. అయితే, ఈ విష‌యంలో ఏపీలో సీనియ‌ర్ మోస్ట్ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వం ఉన్న చంద్రబాబు ఫెయిల‌వుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఏపీలో జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ ప్రభుత్వానికి అనుభ‌వం లేదు. ఒక నేర‌స్తుడు సీఎం అయితే, ఎలా ఉంటుందో అలానే ఇప్పుడు ఏపీ ఉంద‌ని చెప్పడానికి, ఏపీలో తాను ఉన్నప్పుడు జ‌రిగిన అభివృద్ధి త‌ప్ప ఇప్పుడు ఏమీ జ‌ర‌గ‌డం లేద‌ని.. జ‌గ‌న్ చేత‌కాని నాయ‌కుడ‌ని చెప్పడానికి చంద్రబాబు శ‌త‌విధాలా ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న అనేక ఉద్యమాలు, యాత్రలు కూడా చేస్తున్నారు.

స్పందనే లేకపోవడంతో….

కానీ, చంద్రబాబు ఆయ‌న ప‌రివారం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను జ‌గ‌న్ ప్రభుత్వం ఎక్కడా ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా త‌న ప‌నితాను చేసుకుని ముందుకు సాగుతోంది. ఎక్కడా జ‌గ‌న్ అస్సలు స్పందించ‌డం మానేశారు. గ‌తంలో అయితే, జ‌గ‌న్ విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు సీఎంగా ఉన్న చంద్రబాబు వెంట‌నే స్పందించేవారు. వెంట‌నే కౌంట‌ర్ కూడా ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డంతో చంద్రబాబు త‌ల్లడిల్లుతున్నారు.

వరస విచారణలతో….

ఒక‌ప‌క్క, సొంత పార్టీ నాయ‌కులు కూడా చంద్రబాబును లైట్ తీసుకోవ‌డం, మ‌రోప‌క్క, ప్ర‌భుత్వం కూడా పెద్దగా ఆయ‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే భావ‌న ఆయ‌న‌కు నిద్ర ప‌ట్టనివ్వడం లేదు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. రోజుకో అవినీతి అంటూ.. గత చంద్రబాబు ప్రభుత్వంపై చేస్తున్న విమ‌ర్శలు మ‌రింత‌గా టీడీపీ శిబిరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రాజ‌ధానిలో భూ బాగోతం గురించి జ‌గ‌న్ ప్రభుత్వం వెల్లడించిన త‌ర్వాత దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక తీవ్ర ఇబ్బంది ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు ఈ ఎస్ ఐ కుంభ‌కోణం అంటూ.. మాజీ మంత్రి అచ్చెన్న కేంద్రంగా సాగుతున్న విచార‌ణ నుంచి కూడా ఇదే ప‌రిస్థితి టీడీపీ ఎదుర్కొంటోంది.

కౌంటర్ ఇవ్వలేక….

ఇక‌, ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఐదేళ్ల పాల‌న‌లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప‌నుల‌పైనా జ‌గ‌న్ స‌ర్కార్ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప‌రిణామాల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు వ్యూహానికి ప్రతివ్యూహం అనుస‌రించ‌లేక తీవ్రంగా మ‌ద‌న ప‌డుతోంది. పోనీ.. ప‌వ‌న్ వంటివారు ఏదైనా కౌంట‌ర్‌తో ఆదుకుంటారా? అంటే ఆయ‌న వెళ్లి క‌మ‌ల‌ద‌ళంలో చేరిపోయి మౌనం పాటిస్తున్నారు. దీంతో ఇప్పుడు వ్యూహానికి ప్రతివ్యూహం వేయ‌లేక‌.. చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నార‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. మ‌రి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Tags:    

Similar News