ఆయన పై ఆశలు లేవు… ఇక ఆమెకే బాధ్యతలు?

వైసీపీకి పట్టున్న ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ పాతకాపులకే పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతలు యాక్టివ్ గా లేకపోవడంతో [more]

Update: 2020-11-14 06:30 GMT

వైసీపీకి పట్టున్న ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ పాతకాపులకే పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతలు యాక్టివ్ గా లేకపోవడంతో పాత వారికే పార్టీ ఇన్ ఛార్జిగా నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీకి ఇన్ ఛార్జిగా ముత్తముల అశోక్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన వైసీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన ఎప్పుడైనా వైసీపీలో చేరే అవకాశాలున్నాయి.

పిడతల కుటుంబానికి…..

దీంతో చంద్రబాబు గిద్దలూరు నియోజకవర్గంలో పిడతల కుటుంబానికి మళ్లీ బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో తొలి నుంచి తెలుగుదేశం పార్టీ బలహీనంగానే ఉంది. కాంగ్రెస్ కు కంచుకోట లాంటి నియోజకవర్గమది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అది జగన పార్టీ వైపు మరిలింది. ఇక్కడ 2009లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది.

ఉన్నా లేనట్లే…..

2014 ఎన్నికల్లో గెలిచిన ముత్తముల అశోక్ రెడ్డిని తన పార్టీలోకి తెచ్చుకున్నారు చంద్రబాబు. అయితే ఆయన 2019 ఎన్నికల్లో దాదాపు ఎనభై వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. అశోక్ రెడ్డి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డికి అత్యంత సన్నిహితుడు. పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు టీడీపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బలమైన నేతను రంగంలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

దశాబ్దాల పాటు శాసించి……

గిద్దలూరు నియోజకవర్గంలో పిడతల కుటుంబానికి మంచి పట్టుంది. దశాబ్దాల పాటు గిద్దలూరు నియోజకవర్గాన్ని ఏలింది. ఇప్పటి వరకూ గిద్దలూరుకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే పిడతల కుటుంబం ఏడుసార్లు విజయం సాధించింది. దీంతో చంద్రబాబు పిడతల సాయికల్పనా రెడ్డిని తన టీంలోకి తీసుకున్నారు. రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. పిడతల సాయికల్పనా రెడ్డి 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అశోక్ రెడ్డిపై నమ్మకం లేకపోవడంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పిడతల కుటుంబానికే గిద్దలూరు టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

Tags:    

Similar News