అచ్చం చంద్రబాబు లాగానే… ?

చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయం స్పూర్తివంతంగానే సాగుతోంది. ఆయననే గురువుగా చేసుకుని తమ్ముళ్ళు ఎక్కడికక్కడ బాగానే ధాటిగా మాట్లాడుతున్నారు. పెద్ద నోరు చేసుకుంటూ చాలానే చెబుతున్నారు. అధికారంలో [more]

Update: 2021-06-07 08:00 GMT

చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయం స్పూర్తివంతంగానే సాగుతోంది. ఆయననే గురువుగా చేసుకుని తమ్ముళ్ళు ఎక్కడికక్కడ బాగానే ధాటిగా మాట్లాడుతున్నారు. పెద్ద నోరు చేసుకుంటూ చాలానే చెబుతున్నారు. అధికారంలో ఉన్నా విపక్షంలో సర్దుకున్నా కూడా వారి గొంతులో ఎన్నడూ స్వరం తగ్గదు. అది ఎపుడూ హై లెవెల్ లోనే ఉంటుంది. అధికారంలో ఉంటే అన్నీ చేశామని అంటారు. ఇక అపోజిషన్ బెంచ్ లోకి రాగానే లాజిక్ లేని వాదనతో ప్రభుత్వ పక్షాన్ని కార్నర్ చేస్తారు. ఈ రకమైన ట్రైనింగ్ విషయంలో చంద్రబాబునే మెచ్చుకోవాలేమో.

బండలు వేయడమే…?

అప్పట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఒక మాట అనేవారు. గుడ్డ కాల్చి మా ముఖాన వేస్తున్నారు. మేము ఆ నల్లటి బురదను తుడుచుకోవాలా అంటూ. దీని భావమేంటి అంటే అభాండాలు వేసేసి మీరే నిరూపించుకోండి అంటూ సవాల్ చేయడం అన్న మాట. ఈ విద్యలో టీడీపీ బాగానే ఆరితేరిపోయిందనే ఇపుడు వైసీపీ నేతలు కూడా అంటున్నారు. తప్పో ఒప్పో ముందు బండ వేసేస్తే చాలు. ఎటూ అనుకూల మీడియా ఉంది కాబట్టి పెద్దక్షరాలతో అచ్చు అవుతుంది. మ్యాటర్ జనాలకు చేరిపోతుంది. దాని మీద ఖండన మండనల తిప్పలేవో సర్కార్ పెద్దలే పడతారు. ఇలాగే చంద్రబాబు తీరు ఉంటోందని వైసీపీ నేతలు మధన పడుతున్నారు.

దారుణమేగా…?

కరోనా రెండవ దశ అంచనా వేయడంతో కేంద్రం పూర్తిగా ఫెయిల్ అయింది. రాష్ట్రాలను ఆ దిశగా కేంద్రం అలెర్ట్ చేయాల్సిన అవసరం ఉన్న నేపధ్యంలో పట్టించుకోలేదు అన్నది జాతీయ మీడియాలో వస్తున్న ఘాటు మాట. కానీ ఏపీలో మాత్రం జగనే కరోనా సృష్టి కర్త అన్నట్లుగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఏపీలో అట్టర్ ఫ్లాప్ సీఎం అంటూ రాళ్ళు వేస్తున్నారు తమ్ముళ్ళు. ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు అయితే మాటల తూటాలనే పేలుస్తున్నారు. ఎక్కడా కరోనా రోగులకు ఏమీ వైద్య సదుపాయాలు అందడంలేదని, ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని అంటున్నారు. అదే కనుక జరిగితే రోజుకు రికవరీ అయి బయటకు వస్తున్న వేలాది మంది రోగుల మాటేంటి అన్న‌ది వైసీపీ వాదన.

ఇదే రూట్లో అలా…?

ముందు ఆరోపణలు చేద్దాం, ఆ మీదట ఏం జరుగుతుందో చూద్దాం అన్న ధోరణితో తమ్ముళ్లు ఉన్నారని అంటున్నారు. నిజానికి కరోనా వేళ జనమంతా భయ కంపితులు అయి ఉన్నారు. వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న అందరిదీ. విపక్ష నేతలు అంటే ఊరకే తిట్ల పురాణం లంకించుకోవడం కాదు కదా. కానీ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు లాంటి వారు ప్రతీ రోజూ ఠంచనుగా విమర్శలతో వీడియో క్లిప్పింగ్స్ నింపి మీడియాకు రిలీజ్ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు జూమ్ యాప్ ముందు కూర్చుంటే ఇక్కడ కూడా తమ్ముళ్ళు గుమ్మం దిగకుండా రచ్చ చేస్తున్నారు. నిజానికి కరోనా వంటి ప్రపంచ విపత్తుని ఎదుర్కొనే శక్తి యావత్తు భారత్ కే లేదు. ఏపీలో ఉన్నంతలో చేస్తున్నారు. దాన్ని పాజిటివ్ మానర్ లో చూసి సలహా సూచనలు ఇస్తే బాగుంటుంది అన్నది అందరి మాట. కానీ జగన్ సర్కార్ ఫెయిల్ అంటూ రోజుకు నాలుగు సార్లు బిగ్ సౌండ్ చేయడం ఫక్త్ పొలిటికల్ స్ట్రాటజీ తప్ప మరోటి కాదు. కానీ టీడీపీలో చంద్రబాబు బాటన అందరూ నడుస్తున్నారు. ఈ రాజకీయ పిడకల వేటలో సమిధలు సగటు జనమే అవుతున్నారు అన్న సంగతిని మరచిపోతున్నారు.

Tags:    

Similar News