పిలుపు వినపడలేదా…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఇప్పుడు నేతలు కేర్ చేయడం లేదనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నేతలు పార్టీ ఓటమి పాలు కాగానే సైడ్ అయిపోయారు. [more]

Update: 2019-08-18 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఇప్పుడు నేతలు కేర్ చేయడం లేదనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నేతలు పార్టీ ఓటమి పాలు కాగానే సైడ్ అయిపోయారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్నా చంద్రబాబు పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల చెంతకు పార్టీని తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అయినా చంద్రబాబు పిలుపును మాత్రం నేతలు పట్టించుకోవడం లేదు.

పంద్రాగస్టు వేడుకలు….

స్వాతంత్ర్య వేడుకలను ప్రతి జిల్లా పార్టీ కార్యాలయాల్లో జరుగుతాయి. ఈ వేడుకలకు చాలామంది నేతలు దూరంగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు సయితం పంద్రాగస్టు పండగకు దూరంగా ఉన్నారు. దిగువ స్థాయినేతలే జెండా పండగను చేసి మమ అని పించారు. కార్యకర్తలు కూడా పార్టీ కార్యాలయాలకు రావడం మానేశారు.

అన్నా క్యాంటిన్లు మూసివేతపై….

ఇక వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసింది. ఈ క్యాంటిన్లను తిరిగి తెరిపించాలంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. స్వయంగా చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నా క్యాంటిన్లు తెరిచేదాకా పోరాటం ఆపవద్దని ఆయన కోరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సయితం పార్టీ నేతలకు అన్నా క్యాంటిన్ల విషయంలో పోరాటం చేయాలని ట్విట్టల్లో నినదించారు. అయినా ఫలితం లేదు.

మాజీ మంత్రులే డుమ్మా…..

మాజీ మంత్రులు సుజయ కృష్ణరంగారావు, ఆదినారాయణరెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మృణాళిని, పితాని సత్యనారాయణ,గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పీతల సుజాత వంటి వారు పోరాటాలకు దూరంగా ఉన్నారు. ఇక ప్రస్తుత ఎంపీ కేశినేని నాని సయితం బాబు పిలుపును పట్టించుకోలేదు. కొందరు ఎమ్మెల్యేలు సయితం ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు పిలుపునకు విలువలేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతుంది.

Tags:    

Similar News