ప్లీజ్ ……బ్రీఫ్ డ్ మి

రాజ‌కీయాల్లో నాయ‌కులకు నిత్యం ఫాలోయింగ్ ఉండాలి. ఏ ఒక్కరోజు మీడియా ముందుకు రాక‌పోయినా.. ఏ ఒక్కరోజు త‌మ కు సంబంధించి వార్త కానీ, త‌మ ఫొటో కానీ [more]

Update: 2019-10-19 06:30 GMT

రాజ‌కీయాల్లో నాయ‌కులకు నిత్యం ఫాలోయింగ్ ఉండాలి. ఏ ఒక్కరోజు మీడియా ముందుకు రాక‌పోయినా.. ఏ ఒక్కరోజు త‌మ కు సంబంధించి వార్త కానీ, త‌మ ఫొటో కానీ దిన‌ప‌త్రిక‌ల్లో క‌నిపించ‌క‌పోయినా.. నాయ‌కులు అల్లాడిపోతుంటారు. అలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉంటారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న త‌న వెంట మీడియాను ప్రత్యేకంగా తిప్పుకొనే వారు. అవ‌స‌రం ఉన్నా లేకున్నా కూడా మీడియాకు ప్రాధాన్యం ఇచ్చేవారు. త‌న మ‌న‌వ‌డితో ఆడుకుంటున్న స‌మ‌యాన్ని కూడా మీడియా క‌వ‌రేజ్ కిందవాడుకునేవారు.

ప్రతిపక్షంలో ఉన్నా….

ఇక‌, పాల‌న‌కు సంబంధించి, ప్రతిప‌క్షాలకు సంబంధించిన విష‌యాల‌ను ఆయ‌న పుంఖాను పుంఖాలుగా మీడియాలో గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడేవారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ప్రతిప‌క్షానికే ప‌రిమిత‌మ‌య్యారు. అయినా కూడా ఆయ‌న మీడియాలో ప్రచారాన్ని కోరుకుంటున్నారు. స‌రే! రాజ‌కీయ నేత‌, ప్రధాన పార్టీకి అధినేత కాబ‌ట్టి ఆయ‌న ఆలోచ‌న‌న‌లను ఎవ‌రూ త‌ప్పుబ‌ట్టాల్సిన ప‌నిలేదు. అయితే, ఆయ‌న మీడియా ముందుకు రావాలంటే ఏదైనా ఒక స‌బ్జెక్ట్ అంటూ ఉండి ఉండాలి క‌దా! నిజానికి ప్రతిప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి స‌బ్జెక్టుకు ఏం త‌క్కువ అనేవారు ఉన్నారు.

ఏది పట్టుకున్నా…..

కానీ, ఇక్కడే చంద్రబాబు పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. ఆయ‌న మాట్లాడేందుకు పెద్దగా స‌బ్జెక్టులు ఏమీ క‌ని పించ‌డం లేదు. రాష్ట్రంలో జ‌గ‌న్ పాల‌న‌ను ఎత్తి చూపించేందుకు ఆయ‌న‌కు ఎక్కడా ఏమీ క‌నిపించడం లేదు. కొన్ని రోజులు రివ‌ర్స్ టెండ‌ర్లను ప‌ట్టుకుని వేలాడినా.. దీనిలో 865 కోట్లను లాభంగా ప్రభుత్వం చూ పించేస‌రికి ఈ స‌బ్జెక్టును చంద్రబాబు వ‌దిలేశారు. ఇక‌, గ్రామ వ‌లంటీర్లు, స‌చివాల‌యాల‌ను జ‌గ‌న్ ప్రభుత్వం ప్రారంభించింది. వీటిని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నించినా.. అది కూడా ఉప‌యోగం లేకుండా పోయింది.

సెటైర్లు పేలుతూ…..

గ్రామ వ‌లంటీవ‌ర్ల వ్యవ‌స్థను తామే ప్రారంభించామ‌ని చంద్రబాబు చెప్పినా .. ఎవ‌రూ న‌మ్మలేదు. ఇక‌, దీంతో ఆయ‌న ఈ స‌బ్జెక్టుకు మంగ‌ళం పాడి.. పార్టీ కార్యక‌ర్తల‌పై దాడులు చేస్తున్నారంటూ.. కొత్త ప‌ల్లవి అందుకున్నారు. అదేస‌మయంలో పోలీసుల‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయ‌న వ్యాఖ్యలు వివాదాస్పదం కావ‌డం, వీటికి వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డంతోనే ప‌రిస్థితి స‌రిపోయింది. ఇక‌, రైతు భ‌రోసా ప‌థ‌కంపై కూడా చంద్రబాబు అనేక ఆరోప‌ణ‌లు చేయాల‌ని అనుకున్నా.. జ‌గ‌న్ ప్రభుత్వం ఆ అవ‌కాశం ఇవ్వకుండా రాష్ట్రంలోని 54 ల‌క్షల మంది రైతుల‌కు దీనిని అమ‌లు చేస్తామ‌ని ప్రక‌టించింది. దీంతో ఇప్పుడు ఏం మాట్లాడాలో.. తెలియ‌క చంద్రబాబు స‌బ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News