బాబు జమానా క్లోజ్ అయినట్లేనా?

గ‌డిచిన నాలుగు రోజులుగా రాష్ట్రంలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ప్రతిప‌క్ష టీడీపీ, అధికార వైసీపీల మ‌ధ్య మాటల యుద్ధం కోట‌లు తాటింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో అస‌లు ఏం [more]

Update: 2019-11-20 14:30 GMT

గ‌డిచిన నాలుగు రోజులుగా రాష్ట్రంలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ప్రతిప‌క్ష టీడీపీ, అధికార వైసీపీల మ‌ధ్య మాటల యుద్ధం కోట‌లు తాటింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో అస‌లు ఏం జ‌రుగుతోంది ? ముఖ్యంగా టీడీపీలో ప‌రిస్థితి ఏంటి ? ఒక్కసారిగా వ‌చ్చిన ఈ పొలిటిక‌ల్ సునామీతో ఆ పార్టీ ఏం చేయ‌బోతోంది ? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్నటి రాజ‌కీయ వార్ గ‌మ‌నిస్తే.. అధికార ప‌క్షం కానీ, ప్రతిప‌క్షం టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వంశీ కానీ చేసిన వ్యాఖ్యల‌ను బ‌ట్టి.. చంద్రబాబు టార్గెట్ అయిన‌ట్టు స్పష్టంగానే క‌నిపిస్తోంది. వాస్తవానికి అధికార ప‌క్షానికి ఎప్పుడూ ప్రతిప‌క్షం టార్గెట్ అవుతూనే ఉంటుంది.

నాడు జగన్ ను…

కానీ, ఇప్పుడు పార్టీ ప‌రంగా కాకుండా పార్టీ అధినేతనే టార్గెట్ చేయ‌డం అనేది చాలా చిత్రంగా అనిపిస్తోంది. గ‌తంలో వైసీపీని కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు సంధించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఇదే పంథా అనుస‌రించారు. జ‌గ‌న్‌ను నేర‌స్తుడ‌ని ఆయ‌న ఏక‌రువు పెట్టారు. స‌రే. ప్రజ‌లు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారు. ఇక‌, ఇప్పుడు టీడీపీ విష‌యంలో వైసీపీ కూడా ఇదే పంథాను అనుస‌రిస్తోంది. పార్టీ ని మొత్తంగా కాకుండా పార్టీ అధినేత‌ను టార్గెట్ చేస్తోంది. చంద్రబాబుకు వ‌య‌సైపోయింద‌ని, ఆయ‌న ఔట్ డేటెడ్ అని తాజాగా మంత్రి కొడాలి నాని పేర్కొన‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది.

వయసు అయిపోయిందంటూ…

నిజానికి ఈ ఏడాది ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక‌.. టీడీపీ ఓట‌మి తెలిసిన త‌ర్వాత ఆ పార్టీ అభిమానులు, సానుభూతి ప‌రులు కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. చంద్రబాబు వ‌య‌సు అయిపోయిందని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న వ‌య‌సు ఇంత, అంత అంటూ లెక్కలు వేసేశారు. వాస్తవానికి ఈ యేడాది ఎన్నిక‌ల్లో ఏపీలోని మెజార్టీ యువ‌త జ‌గ‌న్ వైపు మొగ్గు చూపారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ వెంట ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు యువ‌త‌ను ఆక‌ర్షించ‌డంలో ఫెయిల్ అవ్వడం కూడా ఆ పార్టీ ఓట‌మికి గ‌ల ప్రధాన కార‌ణాల్లో ఒక‌టి.

అవుట్ డేటెడ్ అంటూ….

బాబుకు వ‌య‌సు అయిపోయింద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌లేర‌న్న ప్రచారం ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మ‌రింత‌గా జ‌ర‌గ‌డంతో దాదాపు టీడీపీలోని ఓ వ‌ర్గం నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. దీంతో చంద్రబాబు ఉన్న ప‌ళాన తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని, పార్టీని న‌డిపించే విష‌యంలో ఎక్కడా రాజీ ప‌డేది లేద‌ని ప్రక‌టించారు. ఈ క్రమంలోనే చంద్రబబు ఉద్యమాలు, నిర‌స‌న‌లు చేప‌ట్టారు. కానీ, అంత‌ర్గతంగా మాత్రం చంద్రబాబుపై ఔట్ డేటెడ్ అనే ప్రచారం మాత్రం జ‌రుగుతోంది. మ‌రిదీనిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారా? క‌రుణానిధి మారిదిగా టీడీపీని గైడ్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.

కోటరీ కూడా….

అదే టైంలో బాబు చుట్టూ ఉన్న కోట‌రీతో పాటు ఆయ‌న ఇప్పటికీ న‌మ్ముకున్న నేత‌లంతా వ‌య‌స్సు పైబ‌డిన వారే. క‌ర‌ణం బ‌ల‌రాం, గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, క‌ళా వెంక‌ట్రావు, ముర‌ళీమోహ‌న్ ఇలాంటి నేత‌ల‌ను ఇప్పట‌కి అయినా పూర్తిగా ప‌క్కన పెట్టి యువ‌ర‌క్తాన్ని ఎంక‌రేజ్ చేయ‌క‌పోతే చంద్రబాబుతో పాటు టీడీపీ కూడా ఒక‌టి రెండేళ్లో కంప్లీట్‌గా అవుట్ డేటెడ్ అయిపోయే ఛాన్సే ఉంది.

Tags:    

Similar News