బ్రేకింగ్ : దీక్షకు దిగిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై సీరియస్ అయ్యారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని [more]

Update: 2019-09-11 02:36 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై సీరియస్ అయ్యారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలతో ఆయన కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రశ్నించే గొంతును నొక్కడమేంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ బాధితుల పునరావాస కేంద్రంలోకి ఆహార సరఫరాను నిలిపివేయడం అన్యాయమన్నారు.

12 గంటల దీక్ష….

నిర్భంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని చెప్పారు. దీనిపై ప్రజాస్వామ్య వాదులందరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిరంకుశపాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని చంద్రబాబు నిలదీశారు. బాధితుల కు న్యాయం జరగాలని కోరుతూ ఈరోజు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ తాను నిరాహార దీక్ష చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు దీక్షల్లో పాల్గొనాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News