తప్పులు ఒప్పుకుంటున్నా…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు సమీక్షల్లో తాను చేసిన తప్పులు ఒప్పుకోక తప్పడం లేదు. అలాగే తాను భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నదీ చంద్రబాబు చెప్పేస్తున్నారు. వరసగా జిల్లాలకు [more]

Update: 2019-11-03 05:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు సమీక్షల్లో తాను చేసిన తప్పులు ఒప్పుకోక తప్పడం లేదు. అలాగే తాను భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నదీ చంద్రబాబు చెప్పేస్తున్నారు. వరసగా జిల్లాలకు వెళుతూ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఐదేళ్లలో తాను చేసిన తప్పులను కార్యకర్తల ముందే చెబుతుండటం విశేషం. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదని ఆయన వారి ముందే అంగీకరిస్తున్నారు.

ఐదేళ్లు సీఎంగా ఉండి….

గత ఐదేళ్లలో చంద్రబాబు కార్కకర్తలతో మాట్లాడింది తక్కువ. అంతేకాదు మహానాడు వంటి కార్యక్రమాల్లో మినహాయించి ఆయన నేరుగా కార్యకర్తలను కలసుకుంది లేదు. ఇప్పుడు రెండు నెలలుగా నేరుగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. వారితో సెల్ఫీలు దిగుతున్నారు. మనసు విప్పి మాట్లాడాలని వారికి సూచిస్తున్నారు. దీంతో కొందరు కార్యకర్తలు నేరుగా చంద్రబాబు దృష్టికి తీసుకువస్తున్నారు.

బాబుకు ఫిర్యాదులు….

మచిలీపట్నంలో గత ఐదు నెలల నుంచి ఒక్కసారి కూడా పార్టీ సమావేశం ఏర్పాటు చేయలేదంటూ కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే తమను ఐదేళ్లలో పార్టీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం కలిసేందుకు కూడా తమకు వీలు కల్పించలేదని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు మాత్రం వచ్చి పనిచేయాలని సూచిస్తున్నారని, పార్టీలో కొందరు మాత్రమే ఎదుగుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

ఈసారి తొందరగానే…..

ఇక మరికొందరయితే ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం కూడా ఓటమికి కారణమయిందని చెబుతున్నారు. పెడన అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ ను ఆలస్యంగా ప్రకటించారని, అందుకే ఓటమి పాలయ్యామని కార్యకర్తలు తెలిపారు. దీంతోపాటు ఇకపై పూర్తి స్థాయిలో పార్టీకి సమయం కేటాయిస్తానని, అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కొందరు తనకు దగ్గరగా ఉన్న వారే తప్పుపట్టించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News