వేళ్లన్నీ బాబు వైపేనా…?

చంద్రబాబునాయుడు ఓటమికి గల కారణాలు ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. కానీ తమ్ముళ్లు మాత్రం ఒక్కొక్కటిగా ఓటమికి గల కారణాలు బయటపెడుతుండటం చంద్రబాబునాయుడికి చికాకు తెప్పిస్తుందంటున్నారు. ఇటీవల జరిగిన [more]

Update: 2019-09-04 11:00 GMT

చంద్రబాబునాయుడు ఓటమికి గల కారణాలు ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. కానీ తమ్ముళ్లు మాత్రం ఒక్కొక్కటిగా ఓటమికి గల కారణాలు బయటపెడుతుండటం చంద్రబాబునాయుడికి చికాకు తెప్పిస్తుందంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. కేవలం 23 మంది మాత్రమే గెలవడంతో ఎట్టకేలకు ప్రతిపక్ష హోదా దక్కినప్పటికీ టీడీపీ చరిత్రలోనే ఘోర మైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

సమీక్షలు వాయిదా…?

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తానన్న చంద్రబాబు కొద్దిపాటి సమీక్షలు చేసి వాటి పక్కన పెట్టేశారు. ఈ సమీక్షల్లో ఎక్కువమంది తమకు స్థానిక నేతలు సహకరించలేదని, తమకు అధిష్టానం నుంచి నిధులు అందలేదని, వైసీపీ ఎక్కువగా డబ్బులు పంచిందంటూ ఆరోపించారు. దీంతో చంద్రబాబునాయుడు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలకు ఆదిలోనే స్వస్తి చెప్పారు.

అనేక కారణాలు….

తొలుత కుప్పం తరహా టీడీపీ వ్యూహాన్ని అందరికీ వివరిద్దామని భావించిన చంద్రబాబు నేతలు ఓటమికి చెప్పే కారణాలను విని గమ్మునుండిపోయారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచినా, పసుపుకుంకుమ నిధులు పంచినా ఎవరూ విశ్వసించకపోవడానికి కారణం చంద్రబాబు మాత్రమేనని తమ్ముళ్ల బలమైన ఫీలింగ్. బీజేపీతో తెగదెంపులు చేసుకోవద్దని చెబుతున్నా వినలేదని పార్టీ నుంచి వెళ్లిపోయిన సుజనా చౌదరి ఇప్పటికే కుండ బద్దలు కొట్టేశారు.

ఒక్కొక్కరూ… ఒక్కో రీజన్…..

ఇక తాజాగా గంటా శ్రీనివాసరావు కూడా బీసీలకు టిక్కెట్లు సక్రమంగా కేటాయించక పోవడం వల్లనే ఓడిపోయామన్న సత్యాన్ని బయటపెట్టారు. ఇక ఒంటరిగా పోటీ చేయడం వల్లనే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. కాపు నేతలయితే పవన్ కల్యాణ్ తో కలసి పోటీచేయాలని చెప్పినా చంద్రబాబు వినలేదని ఏకంగా తీర్మానించేశారు. ఇలా చంద్రబాబు నిర్వాకం వల్లనే ఓటమి ఎదురైందని సీనియర్ నేతలందరూ పరోక్షంగా చెబుతుండటం విశేషం. అందుకే చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలను పక్కన పెట్టేశారంటున్నారు.

Tags:    

Similar News