Chandrababu : ఛాన్స్ ఉన్నా జగన్ ను ఎదుర్కొనలేకపోతున్నారే?

పొరుగు రాష్ట్రాల ప్రభావం ఖచ్చితంగా మనపైన కూడా పడుతుంది. అందునా మొన్నటి వరకూ కలసి ఉన్న రాష్ట్రం కావడంతో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏపీలోనూ చర్చనీయాంశం అవుతాయి. [more]

Update: 2021-11-13 13:30 GMT

పొరుగు రాష్ట్రాల ప్రభావం ఖచ్చితంగా మనపైన కూడా పడుతుంది. అందునా మొన్నటి వరకూ కలసి ఉన్న రాష్ట్రం కావడంతో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏపీలోనూ చర్చనీయాంశం అవుతాయి. చంద్రబాబుకు మంచి ఛాన్స్ ఉంది. జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు వీలుంది. అయినా చంద్రబాబు మాత్రం ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. తెలంగాణలో ఈటల రాజేందర్ చేసిన సాహసాన్ని కూడా ఇక్కడ చంద్రబాబు ప్రదర్శించలేకపోతున్నారు.

ఏకపక్షంగా విజయాలు…

దీంతో జగన్ విజయాలు ఏకపక్షంగా కొనసాగుతున్నాయి. జగన్ ను ఎన్నికలకు ముందు మానసికంగా దెబ్బతీయాలన్నది చంద్రబాబు లక్ష్యం. అయితే అందుకు మార్గాలు లేకపోలేదు అంటున్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం తీవ్రంగా ఉంది. అక్కడ కార్మికులు కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి లేదని చంద్రబాబు నిత్యం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న ముగ్గురి ఎమ్మెల్యేలచేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళితే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి.

రాజీనామాలకు….

2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం బలంగా ఉన్నప్పుడే విశాఖ‌పట్నంలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ గెలచుకుంది. అందులో వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ మద్దతుదారుగా మారారు. నిజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే తిరిగి ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద పనేమీ కాదు. పట్టున్న ప్రాంతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉప ఎన్నికకు వెళ్లవచ్చు. అక్కడ విజయం సాధించి జగన్ ను జనంలో కొంత దెబ్బ కొట్టే అవకాశముంది.

ముగ్గురు ఎమ్మెల్యేలు….?

ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు రాజీనామా స్పీకర్ వద్ద ఉంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టవచ్చు. రాజీనామాలు ఆమోదిచాలని వత్తిడి తేవచ్చు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశారు కాబట్టి ఇతర పార్టీలు కూడా మద్దతిస్తాయి. గెలుపు సులువు అవుతుంది. ఒక్క విశాఖ ప్రాంతంలోనే టీడీపీకి ఆ పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. జగన్ ను ఇరకాటంలో పెట్టలేకపోతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేక పోతున్నారు.

Tags:    

Similar News