సక్సెస్ మంత్ర పనిచేసిందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక విషయంలో మాత్రం విజయవంతమయ్యారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఆయన పార్టీ పటిష్టతకు ఉపయోగించుకకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో [more]

Update: 2019-10-27 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక విషయంలో మాత్రం విజయవంతమయ్యారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఆయన పార్టీ పటిష్టతకు ఉపయోగించుకకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలను చూసి చంద్రబాబు ఆశ్చర్య పోవాల్సి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి కావడంతో అప్పటి వరకూ ఓటమి బాధలో ఉన్న టీడీపీ నేతలకు భయం పట్టుకుంది. దీంతో వారు వైసీపీలోకి వెళ్లలేక అనేకమంది బీజేపీ బాట పట్టారు.

వరసబెట్టి వెళుతుండటంతో….

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీని వీడటం పార్టీ నేతల్లో మరింత నైరాశ్యాన్ని పెంచింది. చంద్రబాబు సమర్థతపైనే అనుమానాలు తలెత్తాయి. దీంతో అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు భారతీయ జనతాపార్టీలో చేరిపోయారు. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరితో మొదలయిన వలసలు ఇంకా ఆగలేదు. తాజాగా ఆదినారాయణరెడ్డి కూడా కమలం పార్టీ కండువా కప్పేసుకున్నారు. ఇంకా అనేకమంది టీడీపీ నేతలు హస్తిన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.

బీజేపీతో సయోధ్యకు….

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బీజేపీతో స్నేహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తనకు ప్రధానమంత్రి మోదీతో వ్యక్తిగత వైరం లేదని, రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేమని నేతలకు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా బీజేపీతో కలసి వెళతారన్న సంకేతాలను నేతలకు బలంగా పంపగలిగారు. దీంతో బీజేపీలోకి వెళ్లాలనుకున్న నేతలు కొందరు పునరాలోచనలో పడ్డారు. వచ్చేఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేనలతో కలసి పోటీ చేసే అవకాశం ఉందన్న సిగ్నల్స్ వెళ్లడంతో వలసలు దాదాపుగా ఆగిపోయినట్లేనని పార్టీసీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు.

ఆగిన వలసలు….

అయితే చంద్రబాబు బీజేపీతో సయోధ్య ప్రకటన చేసిన తర్వాత టీడీపీ నేతలు సయితం ఆనందంలో ఉన్నారు. త్వరలోనే బీజేపీ తమ పార్టీ అధినేతను అక్కున చేర్చుకుంటుందన్న నమ్మకం కలిగింది. దీంతో బీజేపీలో చేరేందుకు రెడీ అయిన రాయలసీమ, కోస్తా జిల్లాలకు చెందిన నేతలు కొంత వెనక్కు తగ్గారు. ఇలా చంద్రబాబు ఒకే ప్రకటన చేసి తన పార్టీలో వలసలను ఆపగలిగారు. అలాగే తన నాయకత్వంపై నమ్మకం పెంచుకోగలిగారు. అయితే వైసీపీలోకి వెళ్లాలని చూస్తున్న నేతలు మాత్రం ఆగేటట్లు కన్పించడం లేదు. మొత్తం మీద చంద్రబాబు ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News