బాబుకు బెంగ పట్టేసుకుంది

చంద్రబాబుకి ఇపుడు ఓ పెద్ద బెంగ పట్టేసుకుందంటున్నారు ఆయన్ని దగ్గరుండి గమనిస్తున్న వారు. దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో గెలవడం [more]

Update: 2019-10-25 14:30 GMT

చంద్రబాబుకి ఇపుడు ఓ పెద్ద బెంగ పట్టేసుకుందంటున్నారు ఆయన్ని దగ్గరుండి గమనిస్తున్న వారు. దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యమైపోయింది. కానీ జనం మాత్రం కఠోరమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు వంగి వంగి దండాలు పెట్టినా ప్రాధేయపడినా, ఎన్నో వరాలు ప్రకటించినా, ఆఖరి నిముషంలో అనేక రకాలుగా బతిమాలుకున్నా కూడా ఓటరు కరుణించలేదు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 23 సీట్లతో పక్కన పెట్టేశాదు. నిజానికి ఈ ఎన్నికలు టీడీపీకి తనకు ఎంతటి ప్రాణప్రదమోనని చంద్రబాబుకు తెలిసినంతగా తమ్ముళ్లకు కూడా తెలియదు, తెలిస్తే పార్టీని వారి ఇలా గాలికి వదిలేయరు. అన్ని రకాలుగా పార్టీని ఇబ్బందులో పెట్టి చంద్రబాబు మీద భారం వేసిన తమ్ముళ్ళు ఓడినా కూడా చంద్రబాబు చూసుకుంటా రనుకుంటున్నారు. అదే ఇపుడు చంద్రబాబుని ఎక్కువగా బాధిస్తోంది.

నేనే సీఎం అంటున్న బాబు….

చంద్రబాబు జిల్లా పర్యటనల్లో ప్రసంగాలు పూర్తిగా రోటీన్ గా ఉంటున్న సంగతి విదితమే. ఎందుకంటే కేవలం నాలుగున్నర నెలల వ్యవధిలో వైసీపీ చేసిన పెద్ద తప్పులేం లేవు. జగన్ చంద్రబాబు పదేళ్ళుగా తిడుతున్న తిట్లే మరో మారు తిట్టడం తప్ప సమీక్షల్లో కొత్తదనం ఏదీ లేదు. ఇక చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని మరోమారు క్యాడర్ ముందు ఆవిష్కరించుకుని సంతృప్తి పడడానికి కూడా ఈ సమీక్షలు ఉపయోగపడుతున్నాయి. సరే ఆయన వరకూ ఓకే కానీ కార్యకర్తలకు ఈ సమావేశాలు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయంటే జవాబు సందేహమే. ఇదిలా ఉండగా శ్రీకాకుళం సమీక్షా సమావేశంలో చంద్రబాబు యధా ప్రకారం ఆత్మ స్తుతి పరనిందతో పాటు మరో విషయం చెప్పుకొచ్చారు. అదేంటి అంటే తానే మళ్ళీ సీఎం అవుతానని, నిజానికి ఇది వినడానికి కార్యకర్తలే షాక్ తినాలి. నిన్ననే ఎన్నికలు జరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు కూడా కాలేదు. అయిదేళ్ళ తరువాత జరిగే ఎన్నికల కోసం చంద్రబాబు ఇప్పటి నుంచే కలవరిస్తున్నారంటే వింతా విచిత్రమే మరి.

ఎన్నికల కోసం ఎదురు చూపులు….

ఇదిలా ఉండగా చంద్రబాబు ఇపుడు అర్జంట్ గా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఏది ఎలాగైనా సాగనీ కానీ ఎన్నికలు ఏపీకి వచ్చేయాలి. ఇదీ చంద్రబాబు మదిలో ఆలోచనగా ఉంది. దాన్ని ఆయన అసలు దాచుకోవడంలేదు కూడా. విశాఖ సమీక్షలోనూ అదే చెప్పారు, శ్రీకాకుళం మీటింగులోనూ అదే పాట పాడారు. జగన్ ని ముఖ్యమంత్రిగా అసలు అంగీకరించలేని చంద్రబాబు ఎన్నికలు ఎంత వేగంగా వస్తే అంత బాగుంటుంది అనుకుంటున్నారేమో. కానీ ఎన్నికలు ఓ కాలపరిమితిలో జరుగుతాయి. ఎవరు ఎప్పుడు కోరితే అప్పుడు ఎన్నికలు పెట్టరు కదా, చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు ఈ సంగతి తెలియనిది కాదు, ఎందుకో చంద్రబాబులో బెంగ పట్టుకున్నట్లుంది. మరో అయిదేళ్లకు ఎన్నికలు అంటే అప్పటికి టీడీపీ ఎలా ఉంటుందో, తాను ఇదే రకమైన జోష్ తో ఉండగలనో లేదో అన్న బెంగతో ఆయన ఉన్నట్లున్నారు. అందుకే ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలనుకున్నారు, ఈసారి టీడీపీ గెలిస్తే చంద్రబాబు మరో టెర్మ్ పూర్తి చేయడమో, మధ్యలో కుమారుడికి అధికారం అప్పగించి టీడీపీ వారసునిగా ప్రకటించడమో జరిగేవి. కానీ ఎటూ కాకుండా ఇపుడు అయిపోయింది. దీంతో ఆయన అర్జంట్ గా ఎన్నికలు కావాలి అంటున్నారు. కానీ అది అసాధ్యం. చంద్రబాబు బెంగ ఇప్పట్లో తీరేది కూడా కాదు.

Tags:    

Similar News