బుక్ అయిపోయిన బాబు

ఒక పక్క టిడిపి లో వున్న అగ్రనేతలు అంతా జారిపోతూనే ఉన్నారు. పోతున్న వారు తిన్నంగా వెళుతున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు, లోకేష్ తీరుపైనా పార్టీలో [more]

Update: 2019-10-22 03:30 GMT

ఒక పక్క టిడిపి లో వున్న అగ్రనేతలు అంతా జారిపోతూనే ఉన్నారు. పోతున్న వారు తిన్నంగా వెళుతున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు, లోకేష్ తీరుపైనా పార్టీలో నడుస్తున్న వ్యవహారాలపై ఘాటైన వ్యాఖ్యలే చేస్తున్నారు. వైసిపి పూర్తిగా గేట్లు ఎత్తకపోవడంతో చాలామంది వెయిటింగ్ లో ఉన్నారు. ఇంకొందరు వేచి చూడలేక కాషాయం కండువా కప్పేసుకోవడం మొదలు పెట్టారు. ఇటీవల కొందరికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జై వైసిపి అంటూ పార్టీ మారిపోయారు. కానీ ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఏ మాత్రం ఆత్మపరిశీలన చేసుకోకుండా కొత్త స్లోగన్ అందుకున్నారు. ఆ స్లోగనే ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వైసిపి వర్సెస్ టిడిపి అన్న రీతిలో సెటైర్లు జోకులు పేలిపోతున్నాయి.

ప్రజలు నన్నే కోరుకుంటున్నారంటూ…..

ఒక పక్క నేతలు వద్దు చంద్రబాబు అంటూ పోతూవుంటే మరోపక్క ప్రజలు తన పాలన కావాలని కోరుకుంటున్నారని టిడిపి అధినేత చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనలో వ్యాఖ్యానించడం తాజా పరిణామానికి కారణం అయింది. పార్టీని ఎందుకు సీనియర్లు వీడి వెళ్ళిపోతున్నారనేది ఎందుకు నలభై ఏళ్ళ అనుభవజ్ఞుడిని కాదని గుడ్ బై కొడుతున్నారనే అంశాలు ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు. దీనికి ప్రతిగా వైసిపి నాలుగున్నర నెలల పాలనపై జనం విసుగెత్తి పోయి తన పాలన కావాలని అంటున్నారని స్వయంగా చంద్రబాబు ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చంద్రబాబు పాలన రావాలని, కావాలని నేతలతోనో, కార్యకర్తల తోనో, ప్రజల తోనో మాట్లాడించడం మాని తానే తన పాలన కావాలని జనం అనుకుంటున్నారని చెప్పడం తో సోషల్ మీడియా లో ఐటెం గా బాబు వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.

బాబు కి చిప్ మిస్ అయ్యింది …

చంద్రబాబు వ్యాఖ్యలపై వైసిపి నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆయనకు చిప్ పూర్తిగా పోయిందని సెటైర్లు విసిరేస్తున్నారు. తనకన్నా చిన్నవాడు ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేక పోవడం, తనకు రాని ఆలోచనలు జగన్ కి రావడం పట్ల చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని ధ్వజం ఎత్తుతున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ నుంచి కన్నబాబు వరకు బాబు చిప్ మిస్సింగ్ అంటూ ప్రచారం జోరుగానే చేస్తున్నారు. ఈ చిప్ గొడవ సోషల్ మీడియా లోను గట్టిగానే చక్కెర్లు కొట్టేస్తుంది. మొత్తానికి ఇటీవల కొద్దికాలంగా టిడిపి అధినేత చంద్రబాబు సెల్ఫ్ గోల్స్ బాగానే వేసుకుంటున్నారని వైసిపి వర్గాలు ఆనంద పడుతున్నాయి.

Tags:    

Similar News