అదేంటి? అంత ఉందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరు నాయనా పులివచ్చె కధ మాదిరిగా ఉందని తమ్ముళ్లే అంటున్నారుట. నిజానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఇపుడు తాపీగా ఆలోచించాల్సిన [more]

Update: 2019-10-19 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరు నాయనా పులివచ్చె కధ మాదిరిగా ఉందని తమ్ముళ్లే అంటున్నారుట. నిజానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఇపుడు తాపీగా ఆలోచించాల్సిన సమయం. ఆయన ఇంతకాలం పడిన కష్టం ఒక ఎత్తు. ఇపుడు దిశానిర్దేశం చేస్తూ మెదడుకు పనిచెప్పాల్సిన టైం. పార్టీలో తన తరువాత తరాన్ని తయారు చేయాల్సిన తరుణం కూడా ఇదే. కానీ చంద్రబాబు డెబ్బయేళ్ల వయసులో కూడా అన్నీ తానే, అంతా తానే అన్నట్లుగా దూసుకుపోతానంటున్నారు. తన అనుభవాన్ని తానే కించపరచుకుంటున్నారు. తన ఆలోచనలను తానే చిన్నబుచ్చుకుంటున్నారు. ఏపీలో అయిదేళ్ల చంద్రబాబు పాలన ముగిసి జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కనీసంగా ఏడాది కాలం పాటు అయినా ఓపిక పట్టి ఉండాల్సింది అంటున్నారు.

హుందాతనం పెరిగేది….

అలా కనుక చేసినట్లైతే చంద్రబాబు మీద ప్రజల్లో నమ్మకం పెరిగేది ఆదరణ కూడా అధికమయ్యేది. మరో వైపు హుందాతనం కూడా వచ్చేది. కానీ చంద్రబాబు మాత్రం జగన్ ఇలా సీఎం పీఠం ఎక్కిన మరుసటి రోజునుంచే విమర్శలు మొదలెట్టేశారు. నాలుగున్నర నెలల కాలంలో అది పీక్స్ కి చేరిపోయింది. తిట్లు కూడా దారుణంగా ఉంటున్నాయి. జగన్ వ్య‌క్తిగత విషయాలను కూడా ముందుకు తెచ్చి మరీ దారుణంగా నిందిస్తున్నారు చంద్రబాబు. మరి బాబుకు ఎందుకింత ఆయాసం, అది కూడా కాని టైంలో అంటున్నారు సహచర నాయకులు, తమ్ముళ్ళు కూడా. చంద్రబాబు ఉన్న శక్తినంతా ఇపుడే వాడేస్తే ఇక ఆయన రాబోయే రోజుల్లో ఏ విధంగా జగన్ సర్కార్ మీద పోరాడుతారన్న సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

అపుడు నమ్ముతారా…?

చంద్రబాబు అయిదేళ్ల పాటు అధికారంలో ఉంటూ జగన్ ని విమర్శించారు. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చే సమయం మధ్యలోనూ విమర్శించారు. ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చాక హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా విసుగూ విరామం లేకుండా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు విన్నవారు దీన్ని రోటీన్ అన్నట్లుగానే చూస్తున్నారు. చంద్రబాబు ప్రకటనలు, ఉపన్యాసాలు కూడా పెద్దగా జనంలోకి పోకపోవడానికి కారణం కూడా ఇదేనని అంటున్నారు. దాంతో సీరియస్ నెస్ తగ్గిపోతోంది. ఇదే ఇపుడు టీడీపీలో ఇతర నేతలను భయపెడుతోంది.

నష్టమేనట…

కొత్త సర్కార్ ఏడాది తరువాత ఇదే జోరుతో ఉండదు, కచ్చితంగా ఏవో కొన్ని తప్పులు జరుగుతాయి. అది ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, అధికారుల వైపు నుంచి కావచ్చు. అప్పుడు చంద్రబాబు నిజంగా సర్కార్ మీద సమరశంఖం పూరించినా నమ్మేవారెందరు. అందులో సీరియస్ నెస్ ని గుర్తించేవారు ఎందరు. ఇదీ టీడీపీలో వినిపిస్తున్న కొత్త మాట. చంద్రబాబు ఎపుడూ జగన్ ని తిడుతూనే ఉంటారనుకుని జనం సరిగ్గా స్పందించకపోతే రాజకీయ నష్టం కచ్చితంగా టీడీపీకే జరుగుతుంది. మరి నాయనా పులివచ్చే మాదిరిగా చంద్రబాబు అపుడు నిజం చెప్పినా జనానికి ఎక్కుతుందా అన్నది తమ్ముళ్లకు వస్తున్న బిగ్ డౌట్.

Tags:    

Similar News