బాబుతో గోక్కుంటే అంతేనా?

చంద్రబాబు అంటే గండరగండడు. ఆయనకు రాజకీయమే ఊపిరి. పదవులే పరమార్ధం. అందుకోసంచంద్రబాబు ఏమైనా చేస్తారని ప్రత్యర్ధులు అంటారు. రాజకీయాల్లో ఉన్న వారికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. [more]

Update: 2019-10-18 03:30 GMT

చంద్రబాబు అంటే గండరగండడు. ఆయనకు రాజకీయమే ఊపిరి. పదవులే పరమార్ధం. అందుకోసంచంద్రబాబు ఏమైనా చేస్తారని ప్రత్యర్ధులు అంటారు. రాజకీయాల్లో ఉన్న వారికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఎంతటి వారైనా తమ రాజకీయం తాము చేసుకుంటారు. ఈ విషయంలో ఓ సిధ్ధాంతం, పధ్ధతి ఉంటుంది. అయితే ఎక్కడో హర్యానాలో పుట్టిన ఆయారాం గయారాం కల్చర్ ఏపీలో పాతుకుపోవడానికి చంద్రబాబు ఆద్యుడు అంటారు. అంతకు ముందు కూడా ఫిరాయింపులు ఉన్నా కాస్త బిడియం ఉండేది. నూటికో కోటికో ఒకరు అటు నుంచి ఇటు వచ్చేవారు. చంద్రబాబు మార్క్ పాలిట్రిక్స్ తో ఎటువంటి జంకూ గొంకూ లేకుండా జెండాలు మార్చేడం నిన్నటి కధ. ఇక పాతికేళ్ళ క్రితం వరకూ వెళ్ళగలిగితే ఏకంగా ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే సొంత పార్టీ నుంచి వెళ్లగొట్టిన వెన్నుపోటు చరిత్ర కనిపిస్తుంది. అలా ప్రారంభమైన చంద్రబాబు రాజకీయం సిధ్ధాంతాలతో రాధ్ధాంతాలతో సంబంధం లేకుండా ఆలా సాగుపోతూనే ఉంది.

మోడీకి ప్రేమలేఖలు….

ఇపుడు చంద్రబాబుకు మోడీ అంటే మళ్ళీ వలపు పుడుతోంది. అలా ఇలా కాదు కలలో కూడా ఆయ‌నే కనిపిస్తున్నారు. ఒకపుడు కూడా మోడీ కలలో కనిపించేవారు. అపుడు బద్ద వ్యతిరేకతతో. ఇపుడు మాత్రం మోడీ అంటే ప్రేమ పొంగిపొర్లుతోంది. అది దాచుకోవడానికి కూడా చంద్రబాబు ఎక్కడా వెరవవడంలేదు. విశాఖ సాగర తీరన సత్యశోధన చేసిన చంద్రబాబుకు తాను ఎందుకు ఓడిపోయానో అర్ధమైంది. అంతే బయటపెట్టేసుకున్నారు. మోడీతో గొడవ పెట్టుకోవడం వల్లనే తానే ఓటమి పాలు అయ్యాయని చంద్రబాబు కార్యకర్తల సాక్షిగా ప్రకటించారు. ఇపుడు నెల్లూరు సమీక్షా సమావేశంలోనూ అదే గొంతు కాస్త పెంచి మోడీతో నాకు వ్యక్తిగత వైరం ఉందా? ఆయన నాకు ఏం అన్యాయం చేశారు, నేను ఏం చేశానంటూ గొంతు చించుకుంటున్నారు. నిజమే వ్యక్తిగత విభేదాలు లేవు, అందుకేనా నల్ల కుండలతో ప్రధానికి స్వాగతం పలికినది, మోడీకు కుటుంబం లేదు, పాడూ లేదు అంటూ తాను అనడమే కాకుండా సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారి చేత అనిపించినది, మోడీ హఠావో అంటూ దేశాలు పట్టుకుతిరిగినది. ఇలా అడిగినా కూడా చంద్రబాబు సమాధానం చెప్పగలరు, ఇదంతా దేశం కోసం చేశాను తప్ప నాకూ మోడీ శత్రువా ఏంటి అని మళ్లీ దబాయించగలరు. సరే మోడీ ఇపుడు చంద్రబాబుకు కావాలి. ఆయన లవ్ యమ జోరుగా ఉంది. కానీ మోడీ మాటేంటి.

గేట్లు తీస్తారా…?

చంద్రబాబుకు ఎపుడో బీజేపీ గేట్లు మూసేశామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అప్పట్లో ఏపీలో ప్రతీ సభలోనూ గట్టిగానే చెప్పారు. చంద్రబాబుని ఎప్పటికీ మావైపు రానివ్వమని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. అయితే రాజకీయాల్లో ఇలాంటి మాటలకు విలువ లేదు అనుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నది మోడీ, అమిత్ షా వారు పూర్తిగా రాజకీయం వంటబట్టించుకున్న వారు కారు. వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి. సామాన్యుడి టైపులో కక్షలు, కావేశాలు కూడా ఉన్నాయి. అందుకేగా ఎపుడో దశాబ్దం క్రితం తనను జైల్లో పెట్టించారని పగపట్టి మరీ కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని జైల్లో పెట్టించినది. ఇక మోడీ స్వభావం తెలిసిన వారు ఆయన చంద్రబాబుని ఎప్పటికీ నమ్మరు అంటారు. నిజానికి 2014 ఎన్నికల ముందు టీడీపీతో పొత్తుల విషయంలో కూడా చంద్రబాబు అంటే మోడీకి గిట్టేది కాదు అంటారు. అయితే అప్పటి పార్టీ ప్రెసిడెంట్ రాజ్ నాధ్ సింగ్ చంద్రబాబుకు సన్నిహితుడు, పైగా బీజేపీలో పెద్ద తలకాయలు నాడు ఉన్నాయి. మోడీకి పార్టీ పట్టు చిక్కని రోజులవి. ఇపుడు బీజేపీ అంటే మోడీ, అమిత్ షాలు మాత్రమే. అందువల్ల చంద్రబాబుని ఎప్పటికీ బీజేపీలోకి రానివ్వరు అంటారు కొందరు కమలనాధులు. చూడాలి మరి.

Tags:    

Similar News