జెండా పీకుతున్నారే

చంద్రబాబునాయుడు ఇప్పుడు బిగ్ ట్రబుల్ లో ఉన్నారు. ఆయన పార్టీ కోసం శ్రమిస్తున్నప్పటికీ భవిష్యత్ లేదని నాయకులు నిర్ణయించేసుకున్నట్లుంది. ఓటమి తర్వాత ఏ పార్టీకి అయినా కష్టాలు [more]

Update: 2019-08-30 11:00 GMT

చంద్రబాబునాయుడు ఇప్పుడు బిగ్ ట్రబుల్ లో ఉన్నారు. ఆయన పార్టీ కోసం శ్రమిస్తున్నప్పటికీ భవిష్యత్ లేదని నాయకులు నిర్ణయించేసుకున్నట్లుంది. ఓటమి తర్వాత ఏ పార్టీకి అయినా కష్టాలు తప్పవన్నది తెలిసినా పార్టీకి ఫ్యూచర్ లేదని భావించడమే డేంజర్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే జరుగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు కూడా కొద్దికాలం నైరాశ్యంలోకి వెళ్లారు. అయితే ఆయన వెంటనే తేరుకుని తిరిగి పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.

ఇప్పటికే కొందరు నేతలు…..

కానీ చంద్రబాబు నాయకత్వం పై నమ్మకంలేని కొందరు నేతలు ఇప్పటికే ఇతర పార్టీల బాట పట్టారు. ఎన్నికల అనంతరమే అనంతపురం జిల్లాలోని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీని వీడారు. ఇది చంద్రబాబు ఊహించని విషయం. తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి లాంటి నేత కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అయిపోయారన్న వార్తలు వచ్చాయి. ఇక నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లింది చంద్రబాబుకు తెలిసే జరిగిందని అన్నా జనాల్లో మాత్రం పార్టీ పలుచన పడింది.

విశాఖ డెయిరీ…..

ఇప్పుడు తాజాగా విశాఖ జిల్లాకు చెందిన నేతలు వరసబెట్టి పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా విశాఖ డెయిరీ తెలుగుదేశం పార్టీ చేతుల్లోనే ఉంది. విశాఖ డెయిరీ ఛైర్మన్ గా ఉన్న ఆడారి తులసీరావు తనయుడు వైసీపీలోకి సెప్టంబరు 1వ తేదీన చేరనున్నారు. దీంతో విశాఖ డెయిరీ కూడా వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోనుంది. అలాగే అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సయితం బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.

బలమైన నేతలు వెళ్లిపోతుండటం…..

ఇలా వరస బెట్టి నేతలు వెళుతుండటంతో చంద్రబాబు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేతలు పార్టీని వీడుతుండటం చంద్రబాబుకు పెద్ద దెబ్బేనన్నది విశ్లేషకుల అంచనా. ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వస్తే తప్ప పార్టీలో చేర్చుకోనని జగన్ చెప్పడంతోనే 23 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది ఆగారన్నది వాస్తవం. లేకుంటే వారు కూడా జెండా పీకేసేవారు. తెలంగాణలో పార్టీ ఘోరంగా తయారయింది. ఏపీలోనూ చంద్రబాబుకు సేమ్ సీన్ రిపీట్ అవుతుండటం ఆందోళన కల్గించే విషయమే.

Tags:    

Similar News