ఈసారి రాంగ్ స్టెప్ వేయరట… ఇప్పటి నుంచే?

వచ్చే ఎన్నికల గురించి చంద్రబాబు ఇప్పటి నుంచే ఆలోచిస్తారు. ఆయన ధ్యాసంతా రానున్న ఎన్నికల మీదనే ఉంటుంది. కాల చక్రం ఎంత గిర్రున తిరిగితే అంత మంచిది [more]

Update: 2020-10-10 08:00 GMT

వచ్చే ఎన్నికల గురించి చంద్రబాబు ఇప్పటి నుంచే ఆలోచిస్తారు. ఆయన ధ్యాసంతా రానున్న ఎన్నికల మీదనే ఉంటుంది. కాల చక్రం ఎంత గిర్రున తిరిగితే అంత మంచిది టీడీపీ అధినేతకు. అయితే ఈసారి ఒంటిరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబు చేయరన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. చంద్రబాబు పొత్తులతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లనున్నారన్నది వాస్తవమంుటున్నారు టీడీపీ సీనియర్ నేతలు. కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన.

జనసేనను లాగేసి….

చంద్రబాబు ఆలోచనంతా ముఖ్యంగా జనసేనపైనే ఉంది. జనసేనతో కలసి పోటీ చేస్తే ఓట్ల శాతం కూడా పెరిగి జగన్ ను దెబ్బతీయవచ్చన్నది చంద్రబాబు వ్యూహం. జనసేనతో పాటు బీజేపీ కూడా కలసివచ్చినా ఆయనకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేసేందుకు వెనకాడుతుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుంది. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.

బీజేపీ వచ్చినా…..

బీజేపీ కలసి రాకపోతే జనసేననైనా దాని నుంచి వేరు చేయాలన్నది చంద్రబాబు ప్లాన్ గా ఉంది. పవన్ కల్యాణ్ పట్ల చంద్రబాబు తొలి నుంచి సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన పవన్ పార్టీతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ పవన్ తాను వామపక్షాలతో కలసి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో వీలుపడలేదు. ఈసారి పవన్ ఆలోచనల్లో కూడా మార్పు వచ్చిందంటున్నారు. జగన్ ఓడించాలంటే అందరం ఒక్కటవ్వాలన్నది పవన్ ఆలోచనగా ఉందంటున్నారు.

ఆ రెండు పార్టీలు కూడా….

చివరి నిమిషం వరకూ పొత్తు విషయం తేల్చకుండా బీజేపీ, జనసేనలు చంద్రబాబు నుంచి ఎక్కువ స్థానాలను పొందాలన్న వ్యూహం కూడా ఉందంటున్నారు. సీట్ల పంపకాల్లో గతంలో మాదిరిగా కాకుండా తాము అడిగినన్ని సీట్లకు చంద్రబాబు అంగీకరించేలా పరిస్థితిని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు వారి డిమాండ్లకు తలొగ్గక తప్పదని ఈ రెండు పార్టీలూ ఉన్నాయంటున్నారు. ఎన్నికలకు ఇంకా సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తుతోనే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది వాస్తవం.

Tags:    

Similar News