కాలం కలిసి రాకుండా పోతుందా …?చావని బాబు ఆశలు …?

బీజేపీ తో తిరిగి చేతులు కలిపే ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు వదులుకునేందుకు ఇప్పుడు సిద్ధంగా లేరు. గత ఎన్నికల ముందు తన రాజకీయ అవసరాలకోసం మోడీ, [more]

Update: 2020-09-03 06:30 GMT

బీజేపీ తో తిరిగి చేతులు కలిపే ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు వదులుకునేందుకు ఇప్పుడు సిద్ధంగా లేరు. గత ఎన్నికల ముందు తన రాజకీయ అవసరాలకోసం మోడీ, షా లకు తొడకొట్టిన చంద్రబాబు ఫలితాలు అనంతరం నాలిక కరుచుకున్నారు. కేంద్రం లో మోడీ, రాష్ట్రం లో జగన్ ఇద్దరు అధికారం చేపట్టేశారు. తాను ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఎంతటి పొరపాటు చేశానో అనుకుని పశ్చాత్తాప పడినా జరగాలిసిన డ్యామేజ్ ఆయనకు ఆయన పార్టీకి జరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరు బలమైన శత్రువులతో ఒకేసారి పోరాడాలిసి వస్తుంది. అదీ నాలుగేళ్లపాటు అంటే మాటలా. ఈ లోగా తన పార్టీని వారు ఖాళీ చేయకుండా ఉండాలి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నడుమ ఆయన స్నేహ హస్తం చాచడం మొదలు పెట్టారు.

కలుపుకోవడానికి నానా అవస్థలు …

మొదట కమలం కోరుకున్నట్లు రాజ్యసభ సభ్యులను వారికి అప్పగించి టిడిపి ని పెద్దల సభలో చంద్రబాబు ఖాళీ చేయించారు. ఆ తరువాత కూడా కొందరు నేతలను బిజెపి లోకి వెళ్ళి జగన్ దాడులనుంచి కాపాడుకోమని సలహా ఇచ్చారని ప్రచారం సాగింది. ఇక ఏ చిన్న ఛాన్స్ దొరికినా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లతో మాట్లాడేందుకు వారికి లేఖలు రాసేందుకు ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పనిలో పనిగా ఆర్ ఎస్ ఎస్ కి చెందిన ప్రముఖులతోను రహస్య మంతనాలు చంద్రబాబు సాగిస్తున్నట్లు టాక్. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా అమిత్ షా కు కరోనా సోకడం ఆయన కోలుకోవడం జరిగాయి. ఈ సందర్భాన్ని సైతం చంద్రబాబు వదులుకోలేదు. ఆయనకు ఫోన్ చేసి యోగ క్షేమాలు విచారించారు. ఇలా ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు ను మించిన పొలిటీషియన్ దేశంలోనే ఎవరు వుండరు.

బిజెపి కి బాబు స్నేహం తో సమస్యేనా …?

తాజాగా చంద్రబాబు బిజెపి తో వచ్చే ఎన్నికల్లోగా దోస్తానా తిరిగి కట్టేందుకు ఇప్పటినుంచి చేయని ప్రయత్నం కూడా లేదు. బిజెపి, జనసేన, టిడిపి కూటమి మాత్రమే వచ్చే ఎన్నికల్లో వైసిపి జోరు కు బ్రేక్ వేయగలదని ఇప్పుడు బాబు కి బాగా బోధ పడింది. దానికి ఆయన ఎత్తులు పై ఎత్తులు గట్టిగానే చేస్తున్నారు. అయితే ఎపి లో తమను తోక్కేసిన సైకిల్ పార్టీ తో జత కట్టేందుకు కమలం సిద్ధంగా ప్రస్తుతానికి అయితే లేదు. ముందుగా ప్రధాన విపక్షాన్ని మట్టికరిపించి ఆ తరువాత అధికారపక్షం సంగతి చూడాలనే వ్యూహంతో సాగుతుంది. అయితే రాజకీయాల్లో శాస్వత శత్రువులు ఉండరు కనుక బిజెపి స్టాండ్ ఇలాగే ఉంటుందని చెప్పడం కష్టమే. టిడిపి ని మట్టానికి తొక్కలేకపోతే అదే పార్టీ తో దోస్తీకి కమలం ఎన్నికలముందు సై అనక తప్పదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తో ప్రస్తుతం దోస్తీ కొనసాగిస్తున్న కమ్యూనిస్ట్ లు జంక్షన్ లో జండా లా మిగిలే పరిస్థితి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News