దెబ్బయిపోయింది ఇలానా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవలి ఎన్నికల్లో ఘోర ఓటమికి గల కారణాలను ఒక్కొక్కటి బయటపెడుతున్నారు. ఊహించని విధంగా పార్టీ దెబ్బతినడానికి పార్టీ సమీక్షల్లో ఆయన కార్యకర్తల [more]

Update: 2019-10-12 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవలి ఎన్నికల్లో ఘోర ఓటమికి గల కారణాలను ఒక్కొక్కటి బయటపెడుతున్నారు. ఊహించని విధంగా పార్టీ దెబ్బతినడానికి పార్టీ సమీక్షల్లో ఆయన కార్యకర్తల ముందు ఉంచుతున్నారు. తాజాగా చూసుకుంటే చంద్రబాబు బీజేపీతో విభేదించి తప్పు చేశామని ఒప్పుకున్నారు. విశాఖ సమీక్షలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేంద్రంతో విభేదించడంతోనే ఎక్కువగా నష్టపోయామని చంద్రబాబు అంగీకరించారు.

కేంద్రంతో ఘర్షణ వైఖరి….

ఎన్నికలకు రెండేళ్ల ముందు ఎన్డీఏతో కటీఫ్ చెప్పడం, ఆ తర్వాత ధర్మ పోరాట దీక్షలంటూ జిల్లాల పర్యటన చేయడాన్ని ఆయన గుర్తు చేసుకున్నట్లుంది. ధర్మ పోరాట దీక్షల వల్ల పార్టీకి ఏమాత్రం కలసి రాకపోగా, నష్టం చేకూరిందని చంద్రబాబు అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉంటే ఇక్కడి ప్రజలు తనను ఆదరిస్తారని చంద్రబాబు భావించారు. అందుకే గత ఎన్నికల్లో మోడీని విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

రెండు ప్రయోజనాలు…..

కానీ ఫలితాల్లో మాత్రం చంద్రబాబుకు ఊహించని దెబ్బ తగలింది. అయితే కేంద్రంతో విభేదించడం వల్లనే ఎక్కువగా నష్టపోయామని చంద్రబాబు కార్యకర్తలకు చెబుతున్న తీరును చూస్తుంటే చంద్రబాబు రెండు రకాల ప్రయోజనాలున్నాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా ఉండే అవకాశం దొరకవచ్చు. రెండోది తన పరిపాలన వల్ల ఓడిపోలేదని, కేంద్రంతో ఘర్షణ వైఖరి వల్లనే ఓడిపోయామన్న కలరింగ్ ఇవ్వవచ్చు.

పవన్ కు దగ్గరయ్యేందుకు….

ఇలా చంద్రబాబు తన జిల్లాల పర్యటనలో గత ఎన్నికల్లో జరిగిన లోపాలను, తప్పులను కార్యకర్తలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలచి ఉంటే బాగుండేదని కూడా వ్యాఖ్యానించారు. ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారీ పరాజయం దక్కుతుండటంతో ఈసారి ఖచ్చితంగా పవన్ కల్యాణ్ తో కలసి వెళ్లాలనే యోచనలోనే చంద్రబాబు ఉన్నారు. అందుకే తాను గాజువాకలో పర్యటించలేదని కార్యకర్తలకు వివరించి పవన్ ఫ్యాన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

Tags:    

Similar News