చితికి పోయి ఇలా చిన్నదయిపోయిందేది…?

ఎన్టీఆర్ వెండి తెర వేలుపుగా ఉంటూ టీడీపీని ఏర్పాటు చేశారు. ఆయనకు నాడు అన్ని సామాజికవర్గాల మద్దతూ లభించింది. అంతే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ప్రచారం [more]

Update: 2020-08-28 12:30 GMT

ఎన్టీఆర్ వెండి తెర వేలుపుగా ఉంటూ టీడీపీని ఏర్పాటు చేశారు. ఆయనకు నాడు అన్ని సామాజికవర్గాల మద్దతూ లభించింది. అంతే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసి విపక్షలాకు విజయం చేకూర్చారు. సీఎం అయ్యిిరు. ఆయనను తమిళులు, కన్నడిగులు కూడా తమ వాడే అనుకున్నారు. అంత విస్త్రుతమైనది ఎన్టీఆర్ రాజకీయ వ్యక్తిత్వం. ఆయన తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణా వారు. ఆయనను రామన్న అంటూ కీర్తించిందీ వారే. సమైక్య ఆంధ్రా ఎన్టీఆర్ నినాదం అయినా ఆయన జమానాలో ఎక్కడా వేర్పాటు రాగాలు వినిపించలేదు. ఒకసారి పార్టీ ఓడినా కూడా గెలుచుకునే సత్తా ఎన్టీఆర్ ది.

కుంచించుకుపోయి….

చంద్రబాబు చేతిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చాక ప్రాభవం కాస్తా దిగనారడం మొదలైంది. చంద్రబాబు సంకుచిత రాజకీయం మూలంగా టీడీపీ కొందరి పార్టీగా, కొన్ని ప్రాంతాల పార్టీగా మారిపోయింది. టీడీపీ రంగు మారుతోందని గ్రహించిన తరువాతనే తెలంగాణా ఉద్యమానికి టీఆర్ఎస్ స్థాపనకు కేసీఆర్ నడుం బిగించాడు అనుకోవాలి. దాంతో 23 జిల్లాల్లో ఉన్న పార్టీ కాస్తా 13 జిల్లాలకు తగ్గిపోయింది. ఇక 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం ఏపీలో ఎక్కడా గట్టిగా ఉనికి చాటుకునే స్థితిలో టీడీపీ లేదని కూడా రుజువు అయింది.

తప్పుడు విధానాలతో ….

ఇక చంద్రబాబు తప్పుడు విధానాలు అనుసరిస్తూ టీడీపీని రెండు జిల్లాల పార్టీగా మార్చేశారు. ఇంకా చెప్పాలంటే అమరావతి రాజధాని పేరిట రచ్చ చేస్తూ 29 గ్రామాల పార్టీగా దిగజార్చేశారని కూడా అంటారు. ఇపుడు చంద్రబాబు రాజకీయం ఎలా ఉందంటే కులాల కంపు కొట్టిస్తూ ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇక తన కులం వారిని వెనకేసుకురావడానికి ఆయన ఎటువంటి మొహమాటం పడడంలేదు. ఈ పరిణామాలతో టీడీపీ ప్రాంతాలు, కులాల మధ్య ఇరుక్కుపోయి నానాటికీ తీసికట్టు అవుతోంది. ఈ సత్యాన్ని మాత్రం చంద్రబాబు గ్రహించలేకపోతున్నారు.

బరువేనా..?

మరో వైపు సొంత సామాజికవర్గం నేతలు కూడా చంద్రబాబు టీడీపీని ఇలా చేయడాన్ని సహించలేకపోతున్నారు. కమ్మ వారికి మొదటి నుంచి అన్ని పార్టీలతో సఖ్యత ఉంది. వారికి వ్యాపారాలున్నాయి. వారు రాజకీయ ఉచ్చులో పడకుండా ఇంతవరకూ ఉన్నారు. కానీ తన అవసరాల కోసం చంద్రబాబు వేసిన ఎత్తులతో వారంతా చిత్తు అవుతున్నారు. ఈ రోజున కమ్మ సామాజికవర్గం అంటే మిగిలిన వారికి దూరం అన్న భావనను చంద్రబాబు కలిగించారు. దాని వల్ల ఆయన ఏం బావుకున్నారో తెలియదు కానీ కమ్మ వారు మాత్రం మాకొద్దీ చంద్రబాబు నాయకత్వం అంటున్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించింది మొత్తం తెలుగు వారి కోసం, చంద్రబాబు మాత్రం కమ్మ వారికోసమని అనుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారు చంద్రబాబే తమ కులానికి అసలైన బరువు అనేస్తున్నారు. మొత్తం మీద పాతికేళ్ల చంద్రబాబు సారధ్యంతో టీడీపీ చితికిపోయి ఇలా చిన్నదైపోయింది. దీనికి కారణాలు బాబే తనంత‌ట తాను వెతుక్కోవాల్సివుంది.

Tags:    

Similar News