బాబు వారికి బంపర్ ఆఫర్….బద్దులై ఉంటారా?

వైసీపీ అధినేత దెబ్బకు తెలుగుదేశం కకావికలమవుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. మరికొందరు రెడీగా ఉన్నారంటున్నారు. ఇక ఎమ్మెల్సీలు కూడా ముగ్గురు ఇప్పటికే పార్టీని [more]

Update: 2020-08-10 08:00 GMT

వైసీపీ అధినేత దెబ్బకు తెలుగుదేశం కకావికలమవుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. మరికొందరు రెడీగా ఉన్నారంటున్నారు. ఇక ఎమ్మెల్సీలు కూడా ముగ్గురు ఇప్పటికే పార్టీని వీడి వచ్చేశారు. జగన్ కు శాసనసభలో 151 మంది బలం ఉంది. అక్కడ ఎటువంటి సమస్య లేదు. కానీ శాసనమండలిలో బలం తక్కువగా ఉంది. ఇక్కడ చంద్రబాబు చక్రం తిప్పుతారు. అందుకే శాసనమండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఎమ్మెల్సీలు క్యూకడతారని…..

శాసనమండలిలో బలం లేకపోవడంతో ఎమ్మెల్సీలను పార్టీలోకి రప్పించుకోవాలని వైసీపీ తొలుత ప్రయత్నించింది. దాదాపు పదిహేను మంది ఎమ్మెల్సీలు వైసీపీలోకి వస్తారన్న ప్రచారం కూడా జరిగింది. టీడీపీకి దాదాపు 25 మంది వరకూ సభ్యులున్నారు. వీరిలో ఇప్పటికే పోతుల సునీ, శమంతకమణి, శివనాధ్ రెడ్డి లు టీడీపీ నుంచి బయటకు వచ్చారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ పదవికి రాజీనామా చేసి తిరిగి వైసీపీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్సీ అయ్యారు.

బాబు వారితో విడివిడిగా….

మరికొందరు ఎమ్మెల్సీలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరిగింది. డొక్కా మాణిక్యవరప్రసాద్ లాగానే తిరిగి ఎన్నికయ్యే ఛాన్సుందని ఎమ్మెల్సీలు వెళతారని భావించిన చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్సీలందరితో విడివిడిగా ఇటీవల మాట్లాడినట్లు తెలిసింది. వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలుకూడా చంద్రబాబు నుంచి కొన్ని హామీలు కోరినట్లు చెబుతున్నారు. వారికి చంద్రబాబు హమీలు ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీలు కోరిన కోరిక ఏంటంటే… వచ్చే ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని. అయితే ఇందులో కొందరికి చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్లు హామీ ఇచ్చారంటున్నారు.

ఎమ్మెల్యే టిక్కెట్…..

గుమ్మడి సంధ్యారాణికి సాలూరు, బుద్ధా వెంకన్నకు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, బచ్చుల అర్జునుడుకు కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గం, కావలి నుంచి బీద రవిచంద్ర, దీపక్ రెడ్డికి అనంతపురం జిల్లా రాయదుర్గం టిక్కెట్ పై హామీ ఇచ్చారంటున్నారు. రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు ఉన్నప్పటికీ దీపక్ రెడ్డికి హామీ ఇచ్చారంటున్నారు. మరో ఎమ్మెల్సీ తిప్పేస్వామికి హిందూపురం పార్లమెంటు సీటును ఇస్తానని హామీ ఇచ్చారు. నిమ్మల కిష్టప్పను అసెంబ్లీకి పంపనున్నారు. మరో ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అసెంబ్లీ లేదా పార్లమెంటు టిక్కెట్ ఇస్తామని చెప్పారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తనకు పాలకొల్లు సీటు కావాలని అడగ్గా దానికి మాత్రం చంద్రబాబు నోచెప్పారు. అక్కడ ఇప్పటికే నిమ్మల రామానాయుడు ఉండటంతో హామీ ఇవ్వలేదన్నారు.

కొంత సమయం కాావాలని….

ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, దువ్వారపు రామారావు, బుద్ధ నాగేశ్వరరావులకు మాత్రం కొంత సమయం ఇస్తే ఆలోచించి చెబుతానని అన్నారన్న టాక్ ఉంది. శత్రుచర్ల కుటుంబానికి ఇప్పటికే కురుపాం బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్సీలు జారిపోకుండా చంద్రబాబు వారిని సంతృప్తి పర్చేందుకు వరస హామీలు ఇస్తున్నారని చెబుతున్నారు. మరి బాబు ఇచ్చిన బంపర్ ఆఫర్లకు వారు బద్దులై ఉంటారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News