చంద్రబాబు ఒకటి తలిస్తే.. వారు మాత్రం?

అవును మరి అధినేత ఎలా చెబితే అలాగే చేయాలి. ఆయన నంది అంటే అలాగే అనాలి కదా. ఇపుడు పసుపు పార్టీలో అదే ముచ్చట సాగుతోంది. అధినేత [more]

Update: 2020-07-17 05:00 GMT

అవును మరి అధినేత ఎలా చెబితే అలాగే చేయాలి. ఆయన నంది అంటే అలాగే అనాలి కదా. ఇపుడు పసుపు పార్టీలో అదే ముచ్చట సాగుతోంది. అధినేత చంద్రబాబు కరోనా పుణ్యమాని ఇంటి గడప అసలు దిగిడంలేదు. అయితే బాబు రాజకీయాన్ని మాత్రం ఎక్కడా ఆపడంలేదు. ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తెల్లారిలేస్తూనే జగన్ మీద, ఆయన పాలన మీద డజన్ల కొద్దీ ట్వీట్లు చేస్తూ పొలిటికల్ గా తాను యాక్టివ్ గా ఉన్నాను అనిపిస్తున్నారు. ఇక ఆయన దోవలోనే తమ్ముళ్ళు కూడా ఫాలో ఫాలో అంటున్నారు.

అయ్యన్న సైతం…..

ఇక విశాఖ జిల్లా వరకూ వస్తే మాస్ లీడర్ గా పేరున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇపుడు డైరెక్ట్ పాలిటిక్స్ కి ఒక్కసారిగా బ్రేక్ ఇచ్చేశారు. జనాల్లో కనిపించడం కూడా ఈ మధ్య బొత్తిగా తగ్గించేశారు. ఎపుడైతే మునిసిపల్ కమిషనర్ తో వివాదం రావడం, నిర్భయ కేసు ఫైల్ కావడంతో అయ్యన్న కూడా ఇంట్లో ఉంటేనే బెస్ట్ అనుకుంటున్నారు. దాంతో తన ట్విట్టర్ ఖాతాకు పని చెప్పారు. చంద్రబాబు బాటలోనే అయ్యన్న కూడా లెక్కకు మిక్కిలిగా ట్వీట్లు చేస్తూ వైసీపీని చెడుగుడు ఆడుతున్నారు. హ్యాపీగా నీడ పట్టునే ఉంటూ అధికార పార్టీని గట్టిగా తగులుకోవడం ద్వారా తన డ్యూటీని వీరలెవెల్లో చేశానని అనిపించుకుంటున్నారు.

ఈయనా అంతే …..

ఇక యువ నాయకుడు, ఎంపీగా ఉన్న కింజరాపు రాజకీయ వారసుడు రామ్మోహననాయుడు సైతం ట్విట్టర్ ద్వారానే పోరాటం చేస్తున్నారు. అసలే కరోనా కాలం. బయటకు వెళ్తే ఇబ్బందులు, పైగా అధికారం లేని కాని కాలం అని తలచారో ఏమో కానీ రామ్మోహన్ సైతం ట్వీట్లు చేస్తూ బోలేడు కష్టపడుతున్నారు. ఆయన ప్రతీ రోజూ వైసీపీని విమర్శలు చేస్తూ ట్వీట్లతోనే సరిపెడుతున్నారు. ఇక ఇదే తీరున ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు కూడా ఉన్నారు ఆయన ట్విట్టర్ని గట్టిగానే వాడుతూ తాను ఎక్కడా తగ్గలేదు అనిపించుకుంటున్నారు. మరో వైపు జగన్ కి ఏకంగా లేఖలు సంధిస్తున్నారు కూడా.

ఆన్ లైనేనా …..?

ఇపుడు అంతా ఆన్ లైన్ మయం. ఏమంటే బయట కరోనా ఉంది అంటున్నారు. దాంతో అధినేత చంద్రబాబు కళ్లలో పడాలి అంటే ట్విట్టర్ ఒకటే మార్గమని దాన్ని ఆశ్రయిస్తున్నారు. కొత్తగా వచ్చిన నాయకులు, ఎమ్మెల్సీలు కూడా ట్వీట్లకే ప్రాధాన్యత ఇస్తూ మీడియాకు కూడా చిక్కకుండా పోతున్నారు. చంద్రబాబు మాత్రం తాను ఆదేశిస్తే తమ్ముళ్ళు ఫీల్డ్ లోకి వచ్చి రఫ్ఫాడించేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ తమ్ముళ్ళు సైతం అద్దాల మేడల్లోనే హాయిగా గడుపుతున్నారు. తామూ చంద్రబాబుకు సిసలైన వారసులమేనని చాటుతున్నారు. ఇలా పార్టీ మొత్తం ఆన్ లైన్ సేవలో తరిస్తే ఫ్యూచర్ కూడా అక్కడే వెతుక్కోవాలని క్యాడర్ అంటోంది. ఇప్పటికే జనంలో చితికిపోయిన పార్టీకి నాయకులే తీరి కూర్చుని ఇలా దెబ్బేస్తే ఎప్పటికి బతికి బట్టకట్టేనూ అంటున్నారు.

Tags:    

Similar News