జగనే దగ్గరుండి యాక్టివ్ చేస్తున్నట్లున్నారు..మనకు మంచిదేగా?

తెలుగుదేశం పార్టీని దగ్గరుండి జగన్ యాక్టివ్ చేస్తున్నట్లుంది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టీడీపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. దీంతో చంద్రబాబు కూడా వేచి చూసే ధోరణిని [more]

Update: 2020-07-07 15:30 GMT

తెలుగుదేశం పార్టీని దగ్గరుండి జగన్ యాక్టివ్ చేస్తున్నట్లుంది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టీడీపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. దీంతో చంద్రబాబు కూడా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారన్న టాక్ ఉంది. నిజానికి చంద్రబాబు మహానాడు తర్వాత పార్టీ కార్యవర్గాన్ని, కమిటీలను నియమించాల్సి ఉంది. అయితే ఉండేదెవరో? వెళ్లేదెవరో? తెలియక చంద్రబాబు ఆ ప్రక్రియకు కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు.

స్ట్రాంగ్ అవుతున్నారని…..

ఈలోపు జగన్ ప్రభుత్వం పెడుతున్న కేసులతో టీడీపీ నేతలు స్ట్రాంగ్ అవుతున్నారు. ఇది చంద్రబాబుకు మంచి సంకేతమే. అచ్చెన్నాయుడు అరెస్ట్ తో బీసీ వర్గాలు తిరిగి తమకు చేరువవుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అశోక్ గజపతిరాజు మీద కక్ష సాధింపు చర్యలకు దిగడంతో ఆ జిల్లాలో పార్టీకి సింపతీ బాగా వచ్చిందన్న టాక్ ఉంది. రాజుగారికి అన్యాయం చేస్తున్నారని సామాన్యుడు కూడా అనుకుంటున్నారని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.

సైలెంట్ గా ఉన్న వారు సయితం…

ఇక నిన్న మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావును కూడా జగన్ ప్రభుత్వం కెలికింది. ఆయన ముఖ్య అనుచరుడు, సన్నిహితుడిని సోషల్ మీడియా కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయండంతో గంటా శ్రీనివాసరావు హర్ట్ అయ్యారు. నేరుగా తనపై కేసులు పెట్టుకోమని సవాల్ విసిరారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ తో పెద్దగా సింపతీ రాకున్నా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న జేసీ కుటుంబం ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతోంది.

వరస కేసులతో…..

ఇలా దాదాపు 800 మంది టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కక్కరూ పార్టీ కోసం జెండా పట్టుకుని బయటకు వస్తున్నారన్న అంచనాలు ఉన్నాయి. గత ఏడాదిగా తెలుగుదేశం పార్టీలో నిస్తేజం నెలకొని ఉంది. అయితే వరస అరెస్ట్ లతో వారిలో కసి ప్రారంభమయిందని చంద్రబాబు సయితం గుర్తించారు. మరికొంత కాలం ఇదే పద్ధతిని జగన్ ప్రభుత్వం కొనసాగిస్తే తమకు మంచిదేనన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్లుంది. అందుకే ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడుపుతున్నారు.

Tags:    

Similar News