ఇగో అడ్డొస్తోందా ? అందుకే విశాఖ టూర్ కు బ్రేకులా?

మోడీ మీద చంద్రబాబు ఎంత అభిమానం పెంచుకున్నా వర్కౌట్ కావడంలేదు. ఎందుకో తెలియదు కానీ మోడీ చంద్రబాబుని దూరం పెడుతున్నారనే అనుకోవాలేమో. దీనికి తాజాగా జరిగిన సంఘటన [more]

Update: 2020-05-08 13:30 GMT

మోడీ మీద చంద్రబాబు ఎంత అభిమానం పెంచుకున్నా వర్కౌట్ కావడంలేదు. ఎందుకో తెలియదు కానీ మోడీ చంద్రబాబుని దూరం పెడుతున్నారనే అనుకోవాలేమో. దీనికి తాజాగా జరిగిన సంఘటన ఒక ఉదాహరణ అంటున్నారు. తను విశాఖ పర్యటనకు అనుమతించాలని నేరుగా కేంద్రానికి బాబు లేఖ రాశారు. అయితే చంద్రబాబు లేఖకు కేంద్ర హోం శాఖ స్పందించినది ఇప్పటికైతే లేదు. బాబు ప్రత్యేక విమానంలో అదీ లాక్ డౌన్ టైంలో విశాఖకు రావాల్సిన అవసరం కేంద్రానికి ఉన్నట్లుగా కనిపించలేదుగా ఉంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలను కాదని కేంద్రం నేరుగా రంగంలోకి దిగితే ఆ పరిణామాలు రాజకీయంగా ఎలా ఉంటాయో ఊహించే ఎందుకొచ్చిన రిస్క్ అని కేంద్రం చంద్రబాబు లేఖను పట్టించుకోలేదని ప్రచారం సాగుతోంది.

ఇదీ పధ్ధతి….

నిజానికి చంద్రబాబు తనకు ఏపీలో పర్యటించాలని ఉంటే నేరుగా ఏపీ, తెలంగాణా సర్కార్ లను సంప్రదించాలి. తనకు అనుమతిస్తే పర్యటన చేస్తానని ఇద్దరు ముఖ్యమంత్రులకూ అర్జీ పెట్టుకోవాలి. ఈ మేరకు లేఖ రాయాలి. అయితే చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా కేంద్రానికి లేఖ రాయడం కొంత వివాదాస్పదమైంది. పైగా ఆయన తన స్థాయి కేంద్ర స్థాయి అని చెప్పుకున్నట్లుగా ఉందని సెటైర్లు పడుతున్నాయి. లోకల్ గా రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్రం అనుమతించినా కూడా ఇక్కడ ఆయన టూర్ సాఫీగా చూస్తే బాధ్యత లోకల్ ప్రభుత్వాలదే.

అహమే అలా…..

నిజానికి ఏపీ, తెలంగాణా సర్కార్లు రెండూ కూడా పొలిటికల్ వీఐపీల విషయంలో ఉదారంగానే ఉంటున్నాయి. చంద్రబాబు లేఖ రాసినా అటు కేసీఆర్ కానీ, ఇటు జగన్ కానీ అనుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆ విధంగా బీజేపీలోని కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రామకృష్ణ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు అత్యవసర రాకపోకలు సాగిస్తున్నారు. ఇదేమీ తప్పు కాదు కూడా. పైగా చంద్రబాబు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అందువల్ల ఆయన ఎక్కడికైనా వెళ్తానంటే అనుమతించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే తాను నిత్యం విమర్శలు చేసే జగన్, తనను కాదని ఎదిగిన కేసీఆర్ లకు లేఖ రాయడం చంద్రబాబుకు నామోషీగా ఉందేమోనని ప్రచారం సాగుతోంది. మరో వైపు చంద్రబాబు అహం కూడా ఇందుకు అడ్డువస్తోందని అంటున్నారు. అందుకే కేంద్రంతోనే పని కానివ్వాలనుకున్నారు.

అందుకేనా…?

ఇక చంద్రబాబు కోరినట్లుగా కేంద్రం అనుమతిస్తే అది లోకల్ ప్రభుత్వాలను అవమానించినట్లుగా ఉంటుందని డిల్లీ పెద్దలు ఆలోచించినట్లు ఉన్నారని అంటున్నారు. అందుకే చంద్రబాబు టూర్ కి బ్రేక్ వేశారని చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు స్మూత్ గా డీల్ చేయాలి. ముఖ్యంగా చంద్రబాబు దాన్ని వివాదాస్పదం చేసే తీరున మధ్యలోకి కేంద్రాన్ని లాగారని అంటున్నారు. అదే జరిగితే అటు జగన్, ఇటు కేసీఆర్ కూడా హర్ట్ అవుతారు. పైగా బాబు ఇపుడు విశాఖకు అంత అర్జంట్ గా వెళ్ళి చేయాల్సింది ఏదీ లేదని కూడా ఓ అభిప్రాయం ఉంది. ఇక బాబు కనుక ఏపీలో పర్యటించాల్సివస్తే జగన్ కి , అలాగే హైదరాబాద్ లో ఉన్న కేసీఆర్ ను సంప్రదిస్తేనే కుదురుతుందని అంటున్నారు. మరి బాబు మెట్టు దిగుతారా. తన పాదం ముందుకు కదుపుతారా. ఏమో..చూడాలి.

Tags:    

Similar News