ఏంటీ హడావిడి? ఎందుకింత ఆరాటం?

టీడీపీ అధినేత చంద్రబాబు హడావిడి మామూలుగా లేదు. ఆయన ఇంకా ముఖ్యమంత్రిగానే భావిస్తున్నట్లుంది. విశాఖ గ్యాస్ లీక్ సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వానికి సూచనలు చేస్తూ కన్పించారు. [more]

Update: 2020-05-08 05:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు హడావిడి మామూలుగా లేదు. ఆయన ఇంకా ముఖ్యమంత్రిగానే భావిస్తున్నట్లుంది. విశాఖ గ్యాస్ లీక్ సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వానికి సూచనలు చేస్తూ కన్పించారు. కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రసాయనాలు, విషవాయువులు వెలువడినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చంద్రబాబు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాశారు. అంతేకాదు అక్కడ ఏమేం చేయాల్సిందీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఇక చంద్రబాబు అనుకూల మీడియా ఆయనే సీఎంగా భావిస్తూ హైలెట్ చేసేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అక్కడి నుంచే ఆదేశాలు….

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబా? జగనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విశాఖ గ్యాస్ లీక్ సంఘటన జరిగిన వెంటనే హైదరాబాద్ నుంచి పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దీనికి తోడు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబును కూడా చంద్రబాబు అభినందించారు.

సాంకేతిక విషయాలతో సహా….

నిజానికి విశాఖ గ్యాస్ లీక్ సంఘటనలో అక్కడి అధికారులు వెంటనే స్పందించారు. ప్రధానంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు క్విక్ రెస్పాన్స్ కారణంగానే మరణాల సంఖ్య తగ్గింది. అంతేకాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. అందువల్లనే మృతుల సంఖ్య తగ్గింది. ముఖ్యమంత్రి జగన్ కూడా అధికారుల తీరును ప్రశంసించారు. కానీ చంద్రబాబు చేసిన హడావిడి ఇప్పుడు సోషల్ మీడియాలో కామెడీగా మారింది. జాతీయ స్థాయిలో నిపుణులను గుర్తించి విశాఖకు పంపాలని, విదేశాల నుంచి కూడా వైద్యులను విశాఖకు రప్పించాలని, స్టెరిన్ గ్యాస్ పై కూడా చంద్రబాబు ప్రభుత్వానికి అవగాహన కల్పించేలా హడావిడి చేశారని సెటైర్లు పడుతున్నాయి. నలభై రోజులగా కరోనా వ్యాప్తి ఉన్నా ఏపీకి వచ్చే ప్రయత్నం చేయని చంద్రబాబు విశాఖకు మాత్రం వెళ్లాలని కేంద్రానికి అప్లికేషన్ పెట్టుకున్నారంటున్నారు.

ఇప్పుడు వెళ్లి ఏం చేస్తారు?

విశాఖలో ఉదయం పది గంటలకే పరిస్థితి నార్మల్ కు చేరుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. విచారణకు ప్రత్యేక కమిటీ కూడా వేశారు. చంద్రబాబు మాత్రం తాను విశాఖ వెళ్లాల్సిందేనని అంటున్నారు. గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించాల్సిందేనని అంటున్నారు. ఆయన వెళ్లాల్సిన ప్రత్యేక విమానానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరారు. ఇప్పటికే జగన్ బాధితులకు, మృతుల కుటుంబాలకు ఎవరూ ఊహించని ఎక్స్ గ్రేషియో ప్రకటించడంతో ఇక చంద్రబాబు అక్కడకు వెళ్లి ఏం చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప చంద్రబాబు చేయగలిగిందేమీ లేదంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం విశాఖ వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతిస్తుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News