బాబును పడేయాలంటే అదొక్కటే చేయాలట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణంగా ఓటమి పాలయినా సీనియర్ల సలహాలు మాత్రం పట్టించుకోవడం లేదట. భవిష్యత్ రాజకీయ వ్యూహంపై సీనియర్ నేతల సూచనలను పరిగణనలోకి [more]

Update: 2020-05-07 09:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణంగా ఓటమి పాలయినా సీనియర్ల సలహాలు మాత్రం పట్టించుకోవడం లేదట. భవిష్యత్ రాజకీయ వ్యూహంపై సీనియర్ నేతల సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు తాను చెప్పింది వినాలన్నట్లుగా వీడియో కాన్ఫరెన్స్ లు నడుస్తున్నాయట. ఇక మెచ్చుకోళ్లకు మాత్రం నేతలకు పూర్తి సమయాన్ని చంద్రబాబు కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది.

నిత్యం వీడియో కాన్ఫరెన్స్ తో…

లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ప్రతి రోజూ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఒక వీడియో కాన్ఫరెన్స్ లో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకసూచన చేశారు. బుచ్చయ్య చౌదరి చంద్రబాబు కంటే ముందు పార్టీలో చేరారు. ఆయన చంద్రబాబు కంటే పార్టీలో సీనియర్. అయితే బుచ్చయ్య చౌదరి వీయడిో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

గోరంట్ల సలహాను…..

వైసీపీ కొన్ని తప్పులు చేస్తుందని, అయితే వాటిని చేస్తూ పోనిస్తే పార్టీకి ఉపయోగపడుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, అయితే స్థానికంగా దానిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. దానిపై పార్టీ విమర్శలకు దిగిన వెంటనే వైసీపీ నేతలు సర్దుకుంటున్నారని చెప్పారు. కరోనా కిట్ల కొనుగోలు వంటి వాటిపై వెంటనే స్పందించడం సబబే కాని, ప్రజలతో ముడిపడి ఉన్న వాటిపై వెంటనే స్పందించకూడదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వం సమస్య ముదరకముందే సర్దుకుంటుండటంతో ప్రజల వద్దకు వైసీపీ నేతల ఆగడాలు చేరడం లేదని చెప్పారు.

వర్ల పొగడ్తలను మాత్రం….

అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయాన్ని పెద్దగా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వర్ల రామయ్య చంద్రబాబుపై పొగడ్తలు కురిపించారు. ఏపీ ప్రజలంతా ఇప్పుడు ఒకటే అనుకుంటున్నారని, ఈ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారని వర్ల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయనకు నలభై నిమిషాల సమయం చంద్రబాబు కేటాయించారట. ఇలా చంద్రబాబు నడుపుతున్న వీడియోకాన్ఫరెన్స్ లపై టీడీపీ సీనియర్లు పెదవి విరుస్తుండటం విశేషం. గోరంట్ల లాంటి సీనియర్ల సలహాలను పాటించి చూస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయకపోవడంపై పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News