వాళ్లు యాక్టివ్ కావాలంటే.. రిలీజ్ కావాల్సిందేనా?

తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం సాధారణ స్థాయికి చేరుకున్నారు. గత ఎన్నికల్లో జరిగిన ఓటమి నుంచి కొంత కోలుకుంటున్నారు. ముఖ్యంగా శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన [more]

Update: 2020-06-03 05:00 GMT

తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం సాధారణ స్థాయికి చేరుకున్నారు. గత ఎన్నికల్లో జరిగిన ఓటమి నుంచి కొంత కోలుకుంటున్నారు. ముఖ్యంగా శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిలో దాదాపు 70 శాతం మంది తిరిగి పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనడం ఒకరకంగా చంద్రబాబుకు ఊరటనిచ్చే అంశమే. కరోనా సమయంలో టీడీపీ నేతలు చంద్రబాబు వీడయో కాన్ఫరెన్స్ కు హాజరై ఆయన ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు.

ద్వితీయ శ్రేణి నేతలు….

వీరయితే దారికి వచ్చారు కాని ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఇంకా పార్టీకి దూరంగా ఉంటూనే ఉండటం కలవరపర్చే అంశం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. నరేగా నిధులను వైసీపీ ప్రభుత్వం తొక్కి పెట్టడంతోనే వీరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొందరు వైసీపీకి చేరువయ్యారు. మరికొందరు అదే ప్రయత్నంలో ఉన్నారు.

రెండు వేల కోట్ల పెండింగ్ బిల్లులు….

నరేగా నిధులతో ఎన్నికలకు ముందు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలే పనులు చేశారు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు అప్పట్లో చంద్రబాబు చెల్లించలేదు. చెల్లించాలనుకునేలోగా ఎన్నికలు వచ్చాయి. దీంతో తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల కోట్లు చెల్లిస్తానని చంద్రబాబు ఎన్నికల్లో నేతలకు నచ్చ చెప్పగలిగారు. ఎన్నికల్లో వారంతా పనిచేశారు. అయితే అధికారంలోకి రాకపోవడం, పవర్ లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లులను ఆపి వేయడంతో నేతలంతా నీరస పడ్డారు. జిల్లా సమీక్షల్లో చంద్రబాబు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు.

యాక్టివ్ కావాలంటే…..

వారంతా తిరిగి యాక్టివ్ కావాలంటే నరేగా బిల్లుల చెల్లింపు జరగాలి. అందుకోసమే చంద్రబాబు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల టీడీపీ ఎంపీలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. నరేగా బిల్లులను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు. చంద్రబాబు కేంద్రం నుంచి వత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం వెనక నేతలను యాక్టివ్ చేయడం కోసమే. మరి రెండు వేల కోట్లు ఆగిపోతే నేతలు ఎందుకు ముందుకు వస్తారు? దానిని ఇప్పించే బాధ్యత చంద్రబాబుదే అంటున్నారు టీడీపీ నేతలు. మొత్తం మీద చంద్రబాబుకు ఆ రెండు కోట్ల బిల్లులు చెల్లింపు జరిగితే పెద్ద రిలీఫ్ దొరికినట్లే.

Tags:    

Similar News