జాతీయ స్థాయి ప్రచారం కోసం సరికొత్త వ్యూహం

చంద్రబాబు రోజుకో సరికొత్త ఆలోచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో పార్టీ నేతలను, క్యాడర్ లో జోష్ నింపేందుకే గత [more]

Update: 2020-04-30 08:00 GMT

చంద్రబాబు రోజుకో సరికొత్త ఆలోచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో పార్టీ నేతలను, క్యాడర్ లో జోష్ నింపేందుకే గత నెల రోజులుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పేదలకు ఐదు వేలు ఇవ్వనందుకు, వలస కూలీల గోడును పట్టించుకోనందుకు, రైతుల పంటలను కొనుగోలు చేయనందుకు వంటి కారణాలతో నియోజకవర్గాలుగా టీడీపీ నేతలు 12 గంటల దీక్ష చేయాలని చంద్రబాబు ఆదేశించారు. తెలుగు తమ్ముళ్లు నియోజకవర్గ స్థాయి దీక్షలు ముగిశాయి.

మండల స్థాయిలో…

ఇక మండల స్థాయిలో నియోజకవర్గ దీక్షలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ నేతల వల్లనే కరోనా వైరస్ సోకిందన్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడమే చంద్రబాబు ప్రయత్నం. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకే దీక్షలు చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇక మండల స్థాయి నేతలు కూడా పన్నెండు గంటలు దీక్షలు చేస్తున్నారు. అయితే ఇప్పట్లో లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేదు. రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాకపోకలు కూడా ఇప్పట్లో సాధ్యమయ్యేట్లు కన్పించడం లేదు.

దీక్ష చేయాలని….

దీంతో చంద్రబాబు మరికొంత కాలం హైదరాబాద్ లో ఉండక తప్పని పరిస్థితి. అయితే త్వరలోనే తాను వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్షకు దిగాలని చంద్రబాబు యోచిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్ లోని తన ఇంట్లోనే దీక్షకు దిగి ప్రభుత్వంపై వత్తిడి తేవాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. తన దీక్షకు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాని చంద్రబాబు యోచిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం దృష్టికి…..

ఇప్పటికే వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలను ఎలా ఉల్లంఘించిందన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు. రాజ్ భవన్ లో వ్యాధి సోకడం, ఆరోగ్యశాఖ మంత్రి పేషీకి వైరస్ అంటడం వంటి విషయాలను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నారు. దీంతో పాటు కరోనా సమయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆయన ఒకరోజు దీక్షకు దిగుతారని తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి కూడా వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

Tags:    

Similar News