బాబు కెలుక్కుని మరీ…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లో అనుభవం ఉండొచ్చు… కాని ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో తెలయదన్నది మాత్రం ఈ ముప్ఫయిరోజుల్లో అర్థమయిపోయింది. అనవసరంగా కెలుక్కుని మరీ [more]

Update: 2020-05-03 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లో అనుభవం ఉండొచ్చు… కాని ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో తెలయదన్నది మాత్రం ఈ ముప్ఫయిరోజుల్లో అర్థమయిపోయింది. అనవసరంగా కెలుక్కుని మరీ చంద్రబాబు వైసీపీ నేతల చేత మాటలు అనిపించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు ఏపీలో లేరు. ఆయన హైదరాబాద్ లో నెలనుంచి ఉంటున్నారు. ఏపీలో కరోనా వైరస్ పై ఆయన ఇస్తున్న స్టేట్ మెంట్లు, రాస్తున్న లేఖలు రాజకీయంగా కాక రేపుతున్నాయి.

లేఖలు రాసి…..

చంద్రబాబు నేరుగా ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించమని, భౌతిక దూరాన్ని కూడా అలవాటు చేసుకోవాలని కోరారు. ఇందులో తప్పులేదు. అయితే వైసీపీ నేతల కారణంగానే వైరస్ వ్యాప్తి చెందిందన్నది ఆయన చేసిన ఆరోపణ. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ముగ్గురు, నలుగురు మాత్రమే ర్యాలీలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటలో ఎమ్మెల్యేలు ర్యాలీలు నిర్వహించారని, నగరిలో రోజా ప్రజల చేత పూలు చల్లించుకున్నారన్నది తెలుగుదేశం అధినేత ఆరోపణ.

కేసులు లేని చోట….

మరి నగరిలో కేసులు ఎక్కువగా లేవు. సూళ్లూరుపేటలోనూ తక్కువగానే ఉన్నాయి. ఒక్క శ్రీకాళహస్తిలోనే ఈ కేసులు ఎక్కువగా కన్పిస్తున్నాయి. నరసరావుపేటలో కేసులు పెరిగి పోవడానికి కారణమేంటన్న ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనడానికి చంద్రబాబు వద్ద ఏమైనా ఆధారాలున్నాయా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగంటే విజయనగరం జిల్లా కరోనా ఫ్రీగా ఎలా ఉందని వారు నిలదీస్తున్నారు.

ఎదురుదాడికి దిగుతున్న…..

దీంతో చంద్రబాబుపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబు తెలంగాణలో చిక్కుకుపోయి బయటకు రాలేక మతిస్థిమితం కోల్పోయారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన ఇంకా ఏపీ సీఎం మాదిరిగానే వ్యవహరిస్తున్నారని, వాస్తవ పరిస్థితులు చంద్రబాబుకు తెలియవని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు రోజుకో లేఖ, పూటకో మీడియా మీట్ పెట్టి తమను కెలుకుతున్నారని, ప్రజలు చంద్రబాబును ఏమాత్రం విశ్వసించరని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద కరోనా కట్డడి కంటే ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.

Tags:    

Similar News