బాబుని వాళ్లే ఇరికించేస్తున్నారా ?

టీడీపీలో ఒకే నాయకుడు. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన రాజకీయ అనుభవం, వ్యూహాలూ, తెలివి తేటలతోనే టీడీపీ ఇప్పటికీ ఇలా వర్ధిల్లుతూ వస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నా, [more]

Update: 2020-04-30 15:30 GMT

టీడీపీలో ఒకే నాయకుడు. నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన రాజకీయ అనుభవం, వ్యూహాలూ, తెలివి తేటలతోనే టీడీపీ ఇప్పటికీ ఇలా వర్ధిల్లుతూ వస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనదైన ఉనికిని బలంగా చాటుకుంటోంది. సరే చంద్రబాబు సంగతి పక్కన పెడితే తమ్ముళ్ళు ఆయన సమర్ధతతో కొంతైనా పుణికిపుచ్చుకున్నారా అంటే నిరాశే మిగులుతుంది. డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్న చంద్రబాబే అన్నీ చూసుకుంటాడని ధీమా తమ్ముళ్లకు ఉంది. దాంతో వాళ్ళు తమ బుర్రలకు కూడా ఇపుడు పనిచెప్పడం మానేశారులా ఉంది. లేకపోతే జగన్ సర్కార్ పైన తమ్ముళ్ళు చేస్తున్న విమర్శలు చూస్తూంటే ఇదేమైనా వివేకంతో చేస్తున్నవేనా అనిపించకమానదు.

రాజప్రాసాదంలోనట….

జగన్ మీద మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తాజాగా విమర్శలు చేశారు. ఆయన మీద నాలుగు రాళ్ళేసి అటు అధినేత మన్నన పొందాలకున్నారో ఏమో కానీ అత్యుత్సాహాన్నే చూపించారు. జగన్ తాడేపల్లిలోని తన రాజప్రాసాదంలో ఉంటూ బయటకు రావడంలేదుట. కరోనా కేసులు ఏపీలో పెరిగిపోతున్నా పట్టించుకోవడంలేదుట. ప్రజలంటే జగన్ కి తేలిక భావం ఉందిట. ఇవీ అచ్చెన్న చేసిన విమర్శలు. సరే జగన్ రాజప్రాసాదంలో ఉంటున్నారు కానీ ఆయన మంత్రులతో , అధికారులతో పని చేయిస్తున్నారు. మరి హైదరాబాద్ లో ఎపుడో సెటిల్ అయిపోయిన చంద్రబాబు సంగతేంటని వైసీపీ నేతల విమర్శలను అచ్చెన్న అసలు ఊహించలేకపోయారులా ఉంది.

ప్రవాసాంధ్రుడుగా…

చంద్రబాబు ఏపీలో కరోనా కేసులు మొదలవక ముందే విజయవాడలో విమానం ఎక్కి ఎంచక్కా హైదరాబాద్ కి చెక్కేశారు. చంద్రబాబు అక్కడేమీ పేదగా పూరి గుడిసెలో తలదాచుకోవడంలేదు. వందల కోట్లు పెట్టి కట్టించుకున్న విలాసవంతమైన భవనంలోనే ఆయన కులాసాగా ఉంటున్నారు. జగన్ రాజప్రాసాదం కనిపించిన అచ్చెన్న కళ్లకు చంద్రబాబు భారీ భవంతులు కనిపించలేదా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక చంద్రబాబు అసలు ఏపీ ముఖం కూడా చూడకుండా ఎక్కడో ప్రవాస ఆంధ్రుడిగా ఉంటే అచ్చెన్న ఊరికే జగన్ మీద నోరు పారేసుకోవడం ద్వారా కోరి మరీ తమ నాయకుడిని ఇరికించారని, వైసీపీ నేతలతో నాలుగు అనిపించారని అదే పార్టీలో వినిపిస్తోంది.

ఎవరు తక్కువ…

భారీ భవనాల్లోనే రాజకీయ నాయకులు ఉంటారు. ఎక్కడైనా ప్రజలు పేదలు కానీ రాజులు కారు కదా. అది కూడా ప్రజాస్వామ్యంలో అసలైన ప్రభువులు కూడా గద్దెన్నిక్కిన వారే కదా. ఇంతకీ అచ్చెన్న ఏమైనా అద్దె కొంపలో ఉంటున్నారా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన కూడా భారీ భవనాలు కట్టుకుని విలాసంగానే ఉంటున్నారు. ఒకరి మీద రాళ్ళు వేసే ముందు నాలుగు వేళ్ళూ, మిగిలిన రాళ్ళూ తమ వైపే వస్తాయని అచ్చెన్న ఊహించకపోవడమే బాధాకరం. ఇదిలా ఉండగా అచ్చెన్న జగన్ ని అంటున్నానే అనుకున్నారు కానీ తమ నాయకుడు చంద్రబాబు కూడా ఇరుక్కుపోయాడని ఆలోచించకపోవడమే ఇక్కడ అసలైన ట్విస్ట్.

Tags:    

Similar News