బాబు జాతకం అంతేనా…?

చంద్రబాబు ప్రతీ పనిలోనూ రాజకీయం ఆశిస్తారని పేరు. ఆయన నలభయ్యేళ్ల రాజకీయ జీవితం ఆయన్ని అలా చేసిందనుకోవాలి. దాంతో చంద్రబాబులోని అసలైన ఎమోషన్లు కొన్ని సార్లు చూపించినా [more]

Update: 2019-10-08 00:30 GMT

చంద్రబాబు ప్రతీ పనిలోనూ రాజకీయం ఆశిస్తారని పేరు. ఆయన నలభయ్యేళ్ల రాజకీయ జీవితం ఆయన్ని అలా చేసిందనుకోవాలి. దాంతో చంద్రబాబులోని అసలైన ఎమోషన్లు కొన్ని సార్లు చూపించినా కూడా అది కూడా రాజకీయం అనుకున్న వారే ఎక్కువమంది ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా చంద్రబాబు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఆయన మంచిలోనూ చెడులోనూ కూడా తనకే మైలేజ్ వచ్చేలా చేసుకోవడంలో సిధ్ధహస్తుడు అని పేరు కూడా ఉంది. ఇదిలా ఉండగా చంద్రబాబు కృష్ణానది కరకట్ట మీద ఉన్న అక్రమ భవనంలో కాపురం ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడే దాని మీద ఎన్నో విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. ఇపుడు చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చారు. అధికారంలో ఉన్నది జగన్ సర్కార్. దాంతో చంద్రబాబు కరకట్ట కిందకు ఎపుడు నీళ్ళు చేరుతాయో తెలియని పరిస్థితి. అయినా సరే చంద్రబాబు సవాల్ చేస్తున్నట్లుగానే అక్కడ కాపురం ఉంటున్నారు.

సానుభూతి కోసమా…

నన్ను ఇక్కడ నుంచి తప్పించండి అంటూ చంద్రబాబు అంటున్నారు. ఒకవేళ సర్కార్ బలవంతంగా అక్కడ నుంచి కదిలిస్తే ఆ వచ్చే సానుభూతి కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని కూడా అంటున్నారు. అయితే కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉండడం మీద జనాల్లో పెద్దగా సానుభూతి లేదన్న సంగతి చంద్రబాబుకు తెలియకపోవడమే అసలైన విషాదం. చంద్రబాబు చేతికి వాచీ ఉంగరాలు లేకపోయినా ఆయన్ని పేదవారు అని ఎవరూ అనుకోరు. ఇక చంద్రబాబుకు హైదరాబాదు వందలకోట్లతో కట్టించిన ఇల్లు ఉంది. ఇక అమరావతి ఆయన రాజకీయ స్థావరం. అక్కడ కనీసం పది కోట్లు పెట్టి అయినా ఒక ఇల్లు చంద్ర బాబు కట్టుకోలేరా అన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు ఎవరో అక్రమంగా కట్టిన దాంటో అద్దెకు ఉండడం ఏంటి. పది మందికి సుద్దులు చెప్పాల్సిన బాధ్యత గల వ్యక్తి తానే అక్రమ కట్టడంలో ఉండడం ఏంటి అన్నది జనాలకు ఉంది.

పెద్దమనిషిగా ఉండలేరా…?

అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటూ చెబుతున్న నీతులు జనాలకు అసలు పట్టవని కూడా అంటున్నారు. కరకట్ట మీద చంద్రబాబు ఎన్నాళ్ళు కాపురం ఉంటే అన్నాళ్ళు కూడా ఆయన రాజకీయ జీవితం ఎత్తిగిల్లదని కూడా అంటున్నారు. ఇక్కడ ఇల్లే కాదు, చంద్రబాబు టీడీపీ ఆఫీస్ సైతం అక్రమ కట్టడమేనని కూడా తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు భరించే బదులు చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్ గా అక్రమ కట్టడాల నుంచి వైదొలిగి అందరికీ ఆదర్శంగా ఉండడమే కాదు, వైసీపీ సర్కార్ కి కూడా తన గురించి మాట్లాడేందుకు ఏమీ లేకుండా చేయాలని అంటున్న వారు సొంత పార్టీలో ఉండడం విశేషం. చంద్రబాబు ఈ విషయంలో పునరాలోచన చేస్తే ఆయనే పెద్ద మనిషిగా జనంలో ఉంటారని అంటున్న వారూ ఉన్నారు. మరి చంద్రబాబు ఏ విధంగా ఆలోచన చేస్తారో చూడాలి.

Tags:    

Similar News