భజన బృందాలు మారాయ్… చెక్కలు..చిడతల స్థానంలో?

అధికారంలో ఉన్నా.. లేకున్నా త‌మ‌దంతే ఒకే దారి అని నిరూపిస్తున్నారు టీడీపీలోని నాయ‌కులు. కొంద‌రు నాయ‌కుల‌కు భ‌జ‌న బృందాలుగా పేరు ప‌డ్డాయి. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయ‌న [more]

Update: 2020-04-20 15:30 GMT

అధికారంలో ఉన్నా.. లేకున్నా త‌మ‌దంతే ఒకే దారి అని నిరూపిస్తున్నారు టీడీపీలోని నాయ‌కులు. కొంద‌రు నాయ‌కుల‌కు భ‌జ‌న బృందాలుగా పేరు ప‌డ్డాయి. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయ‌న కుమారుడు మాజీ మంత్రి లోకేష్‌ల‌ను పొగ‌డ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న నాయ‌కులు చాలా మంది ఉన్నారు. వీరంతా అధికారంలో ఉన్నప్పుడు ఒక‌రిని మించి ఒక‌రు చంద్రబాబును మ‌చ్చిక చేసుకునేందుకు ప్రయ‌త్నించారు. ఒక‌రిని మించి ఒక‌రు పొగ‌డ్తల‌తో ప్రశంస‌లు కురిపించారు. దీంతో అస‌లు వాస్తవం ఎలా ఉన్నా.. అంతా బాగానే జ‌రుగుతోంద‌నే భ్రమ‌లో ఈ ఇద్దరు బాబులూ పాల‌న సాగించారు. ఇక‌, అధికారం పోయింది. ఇద్దరు బాబులూ కూడా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.

అధికారంలో ఉన్న వరకూ…..

పైగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయిన రెండు రోజుల‌కే మంత్రి అయిన నారా లోకేశ్ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారు. అయినా ఇప్పట‌కీ చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ పొగ‌డ్తల కోసం తాప‌త్రయ ప‌డుతున్నార‌ట‌. చంద్రబాబు ఈ విష‌యంలో కాస్త జాగ్రత్తగా ఉన్నా.. లోకేశ్ మాత్రం పొగ‌డ్తలు, చెక్క భ‌జ‌న‌లు చేసేవారికే ప్రయార్టీ ఇస్తున్నార‌న్న విమ‌ర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. పార్టీ ఘోర ఓట‌మి త‌ర్వాత చంద్రబాబు వెంటే త‌మ రాజ‌కీయ జీవితం అని ప్రక‌టించిన నాయ‌కులు కూడా పార్టీ మారి సైకిల్ దిగేశారు. దీంతో ఇక‌ చంద్రబాబుకు భ‌జ‌న బృందం లేన‌ట్టే అనుకున్నారు అంతా. గ‌తంలో మంత్రులుగా ఉన్న వారు చాలా మంది చంద్రబాబును ఒక‌రిని మించి మ‌రొక‌రు పొగిడేవారు. ఇదే ప‌ద్ధతిని ఎమ్మెల్యేలు కూడా కొన‌సాగించారు. ఇక‌, థ‌ర్డ్ పార్టీగా ఉన్న ఇత‌ర నాయ‌కులు కూడా నామినేటెడ్ ప‌ద‌వులు ఆశించి చంద్రబాబుకు, ఆయ‌న కుమారుడికి భ‌జ‌న గీతాలు ఆల‌పించారు. ఇది నిన్నటి క‌థ‌.

కొత్త వారు చేరి…..

మ‌రి ఇప్పుడు చంద్రబాబు అధికారంలో లేరుక‌దా ? దీంతో భ‌జ‌న ఏమైనా త‌గ్గిందా ? అంటే.. ఏమాత్రమూ త‌గ్గలేదు. అయితే, భ‌జ‌న బృందాలే మారాయి. భ‌జ‌న స‌ర‌ళి మాత్రమే మారింది. నిన్న మొన్నటి వ‌ర‌కు చంద్రబాబును , చినబాబును పొగిడిన నోళ్లు.. ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వాన్ని ఏకేస్తుండ‌డంలో పునీత‌మ‌వుతున్నాయి. అదే స‌మ‌యంలో నిన్నమొన్నటి వ‌ర‌కు ఉన్న బృందాల స్థానంలో కొత్తవారు చేరుకున్నారు. వీరిలొ ఒక‌రిద్దరు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. వీరంతా నిత్యం జ‌గ‌న్‌ను, ఆయ‌న ప్రభుత్వాన్ని విమ‌ర్శించే ప‌నిలో ప‌డ్డారు. నిత్యం ఏదో ఒక విమ‌ర్శతో మీడియా ముందుకు వ‌చ్చి.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ.. బాబుంటే ఇలా జ‌రిగేదా? అంటూ.. ప‌రోక్ష ప్రశంస‌ల‌ను ముంచెత్తుతున్నారు.

బాబుంటే ఇలా జరిగేదా?

ప్రస్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోన్న వేళ టీడీపీలో చాలా మంది కీల‌క నేత‌ల నుంచి, ద్వితీయ శ్రేణి నేత‌ల వ‌ర‌కు బాబు ఉంటే ఏపీలో అస‌లు కరోనాయే వ‌చ్చేది కాద‌న్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబును, లోకేశ్‌ను ఎంత పొగిడినా నాలుగేళ్ల వ‌ర‌కు టీడీపీ నేత‌ల‌కు ఒక్కటంటే ఒక్క ప‌ద‌వి కూడా రాదు. మ‌రి వీరు ఏం ఆశించి ఈ భ‌జ‌న చేస్తున్నారు. ఈ విష‌యంలో ఒక‌రిని మించి మ‌రొక‌రు ఎందుకు పోడీ ప‌డుతున్నారో వారికే తెలియాలి. ట్విస్ట్ ఏంటంటే కొంద‌రు పార్టీ భ‌విష్యత్తు లీడ‌ర్ లోకేశే అని ఆయ‌న్నే ఎక్కువ కీర్తించే ప‌నిలో ఫుల్లుగా ఉంటున్నార‌ట‌.

Tags:    

Similar News