బాబు కల నెరవేరింది.. ఇప్పుడు సందు దొరికింది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కల ఎట్టకేలకు ఫలించింది. నలభై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబుకు పది నెలలుగా ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే [more]

Update: 2020-04-14 09:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కల ఎట్టకేలకు ఫలించింది. నలభై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబుకు పది నెలలుగా ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అదే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం. మోదీతో మనసు విప్పి మాట్లాడటం. కానీ పది నెలల నుంచి ఆయనకిది సాధ్యం కాలేదు. ఢిల్లీలో ఎంత లాబీయింగ్ చేసినా ఫలితం లేదు. మోదీ నుంచి గాని, అమిత్ షా నుంచి గాని ఆయనకు పాజిటివ్ సంకేతాలు రాలేదు.

కరోనా కలిపింది ఇద్దరినీ….

కానీ కరోనా సమయంలో చంద్రబాబుకు కలసి వచ్చినట్లుంది. ప్రధాని మోదీతో చంద్రబాబు ఎట్టకేలకు పది నిమిషాలు మాట్లాడగలిగారు. ఈరోజు ఉదయం 8.30 గంటలకు స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. తాను నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడాలని కోరగానే స్వయంగా ప్రధాని ఈరోజు ఫోన్ చేయడం తనకు సంతోషాన్ని కల్గించిందన్నారు. తాను మూడు జోన్లుగా (ఆరెంజ్, రెడ్, గ్రీన్) దేశాన్ని విభజించాలన్న ఐడియా తాను ఇచ్చానన్నారు. తాను మేధావులతో మాట్లాడి ప్రధాని కార్యాలయానికి పంపానని చెప్పారు.

ఫలితాల పక్క రోజు నుంచే….

ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చేేసిన విమర్శలు మామూలుగా లేవు. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం తిరిగి చంద్రబాబు బీజేపీతో సఖ్యత కోసం చూస్తున్నారు. ఫలితాల పక్క రోజు నుంచే చంద్రబాబు మూడ్ మారిపోయింది. మోదీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మోదీ ఇచ్చే ప్రతి పిలుపునకు చంద్రబాబు స్పందిస్తున్నారు. ఢిల్లీ వెళ్లడానికి కూడా ప్రయత్నించి అక్కడ అపాయింట్ మెంట్ దొరక్క మానుకున్నారు.

ఆధారం దొరికితే….

అయితే కరోనా విషయంలో ప్రధానమంత్రి కార్యాలయానికి సూచనలతో కూడిన లేఖ రాయడంతో చంద్రబాబు మోదీకి దగ్గరవ్వాలన్న ప్రయత్నాలు ప్రారంభించినట్లయింది. చంద్రబాబుకు చిన్న పాటి ఆధారం దొరికితే అల్లుకుపోయే నేత. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కరోనా సమయంలో చంద్రబాబుకు మోదీ మాట్లాడే అవకాశం కలసి వచ్చినట్లుగానే టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అవతల ఉంది డక్కామొక్కీలు తిన్న మోదీ. చంద్రబాబును మించిన రాజకీయ నేత. మరి చంద్రబాబు ఆశలు ఫలిస్తాయో? లేదో? చూడాలి.

Tags:    

Similar News