ఒంటరితనం..కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా?

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్నీ భౌతిక దూరం శాసిస్తోంది. ఎక్కడిక‌క్కడ ప్రజ‌లు, నాయ‌కులు, ప్రముఖులు కూడా భౌతిక దూరం పాటిస్తున్నారు. క‌ర‌చాల‌నాలు (షేక్‌హ్యాండ్స్‌) మానేశారు. న‌మ‌స్కారాల‌తో సంస్కార‌వంతంగా ప‌ల‌క‌రించుకుంటున్నారు. [more]

Update: 2020-04-16 11:00 GMT

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్నీ భౌతిక దూరం శాసిస్తోంది. ఎక్కడిక‌క్కడ ప్రజ‌లు, నాయ‌కులు, ప్రముఖులు కూడా భౌతిక దూరం పాటిస్తున్నారు. క‌ర‌చాల‌నాలు (షేక్‌హ్యాండ్స్‌) మానేశారు. న‌మ‌స్కారాల‌తో సంస్కార‌వంతంగా ప‌ల‌క‌రించుకుంటున్నారు. ఇక‌, ఇళ్లలో జ‌రిగే కార్యక్రమాల‌ను వాయిదా వేసుకున్నారు. సినిమాలు, హాళ్లు, మాల్స్ ఇలా అన్నీ కూడా మూత‌బ‌డ్డాయి. అంటే మొత్తానికి క‌రోనా కార‌ణంగా.. ప్రపంచం మొత్తం భౌతికంగా క‌నిపిస్తున్నా.. దూరం.. దూరం.. అంటూ దూరంగానే ఉంటోంది. ఇక‌, రాజ‌కీయ నేత‌ల విష‌యానికి వ‌స్తే.. వారు కూడా పార్టీ కార్యాల‌యాల‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీ త‌ర‌ఫున నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా చేప‌ట్టడం మానేశారు.

అందరూ ఇళ్లకే…..

మరీ ముఖ్యం అయితే, వీడియో కాన్ఫరెన్సులు గ‌ట్రా నిర్వ‌హిస్తూ.. ముందుకు పోతున్నారు. దీంతో నాయ‌కుల మ‌ధ్య రాజ‌కీయ సామాజిక దూరం మ‌రింత పెరుగుతోంద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. క‌రోనాకు ముందు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. నేత‌లు పార్టీ కార్యాల‌యాల‌కు వ‌స్తూ..వారి వారి ప‌రిస్థితిని వివ‌రించేవారు.. జిల్లాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను వివ‌రించేవారు. అయితే, ఇప్పుడు అంద‌రూ ఇళ్లకే ప‌రిమితం కావ‌డంతో ఇలాంటి వార్తలు, విశేషాలు త‌గ్గిపోయాయి.

ఒంటరితనంతో….

ఇలాంటి ప‌రిస్థితిలో నిత్యం ఏదో ఒక వార్త, విశేషాల‌తో నిండిపోయి.. నిత్యం మీడియా మీటింగుల‌తో బిజీగా ఉండే టీడీపీ అధినేత చంద్రబాబు ఒంట‌రిగా ఫీల‌వుతున్నార‌ట‌. నిజానికి క‌రోనా ఎఫెక్ట్‌తో జ‌న‌తా క‌ర్ఫ్యూ ప్రారంభం రోజు త‌న మ‌న‌వ‌డితో ఆయ‌న ఆడుకున్న వీడియోలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే, జ‌న‌తా క‌ర్ఫ్యూ ఏదో ఒక రోజుతో ముగిసిపోతుంద‌ని అనుకున్నా.. త‌ర్వాత ప్రజ‌లంతా హోం క్వారంటైన్‌కే ప‌రిమితం కావాల‌న్న ప్రభుత్వ ఉత్తర్వులు స‌హా 60 ఏళ్లు నిండిన వారు మరింత జాగ్రత్తలు పాటించాల‌న్న వైద్యుల సూచ‌న‌ల‌తో చంద్రబాబు కూడా హైద‌రాబాద్‌లోని ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.

లాక్ డౌన్ ను తెచ్చిన…..

దీంతో ఆయ‌న ఇప్పుడు చేతినిండా ప‌నిలేక‌.. త‌న నోటి ముందు మీడియా మైకులు లేక అల్లడిపోతున్నార‌ని, కుటుంబం మొత్తంతో ఉన్నప్పటికీ.. క‌రోనా ఆయ‌న‌ను ఒంట‌రిని చేసింద‌ని అంటున్నారు. క‌రోనా ఎఫెక్ట్ లేక‌పోయి ఉంటే.. నిత్యం ఏదో ఒక విష‌యంతో ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చేవారు. ఏదో విష‌యంపై మాట్లాడే వారు.కానీ ఇప్పుడు కేవ‌లం కొద్ది విష‌యాల‌కు మాత్రమే ఆయ‌న వీడియో కాన్ఫరెన్సుల‌కు ప‌రిమిత‌మ‌వుతున్నారు. మొత్తానికి క‌రోనా ఎఫెక్ట్ చంద్రబాబును ఒంట‌రిని చేసిందనే వ్యాఖ్యలు, సెటైర్లు.. సోష‌ల్ మీడియాను ముంచెత్తుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News