దేన్నీ వదలిపెట్టడం లేదుగా

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ అలా సాగుతూనే ఉంటుంది. మంచికైనా చెడుకైనా రెండు పార్టీలు మాటల యుధ్ధం చేయడం పరిపాటి. ఇక అభివృద్ధి అంటూ ఏపీలో [more]

Update: 2019-10-05 13:30 GMT

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ అలా సాగుతూనే ఉంటుంది. మంచికైనా చెడుకైనా రెండు పార్టీలు మాటల యుధ్ధం చేయడం పరిపాటి. ఇక అభివృద్ధి అంటూ ఏపీలో జరిగితే అది తన ఖాతాలోనూ, చెడ్డ ఏమైనా ఉంటే అది వైసీపీ ఖాతాలోనూ జాగ్రత్తగా వేస్తూ చంద్రబాబు రాజకీయ తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఇసుక కొరత, కరెంట్ కొరత వంటి వాటి విషయంలో గత సర్కార్ వారసత్వం తమకు లభించిందని వైసీపీ అంటే ఒప్పుకోని బాబు కేంద్రం రాష్ట్రాలకు వివిధ విభాగాల్లో ఇచ్చే అవార్డులు మాత్రం తన పుణ్యమేనని అంటున్నారు. అంటే పేరు వస్తే తనది, చేటు జరిగితే వైసీపీది ఇదీ చంద్రబాబు విధానం. ఈ సంగతి ఇలా ఉంటే పాలనలో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న జగన్ దాదాపుగా కొత్త కాన్సెప్టులతో పధకాలు, వ్యవస్థలకు శ్రీకారం చుడుతున్నారు.

గ్రామ సచివాలయాలు….

ఏపీవ్యాప్తంగా ప్రారంభించిన గ్రామ సచివాలయ కాన్సెప్ట్ పట్ల ఇపుడు దేశమంతా ఆసక్తి పెరుగుతోంది. ఎందుకంటే పాలనను దాదాపుగా ప్రజల ముంగిటకు చేర్చే అద్భుతమైన కార్యక్రమం ఇది. గ్రామ సచివాలయం అంటే ఓ విధంగా అడుగు దూరంలో ఉండే ప్రభుత్వమే. అన్ని రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవడం ద్వారా వారికి మేలు చేయడమే ముఖ్య ఉద్దెశ్యంగా ఇది రూపకల్పన చేశారు. రెండేళ్ళ క్రితం పాదయాత్రలో జగన్ చెప్పేవరకూ గ్రామ సచివాలయాలు అన్న సంగతి ఎవరికీ వూహకు కూడా అందనిదని చెప్పడంలో తప్పులేదు. పాదయాత్రలో అడుగడుగున్నా జగన్ గ్రామ సచివాలయాలు అని చెప్పినపుడు టీడీపీ విమర్శలు చేసింది. జగన్ ఎన్నికల ప్రణాళికలో పెట్టినపుడు ఎగతాళీ చేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలు పెడుతున్నామని జగన్ చెప్పినపుడు నవ్వుకుంది. కానీ అది ఇపుడు కేవలం నాలుగు నెల‌ల్లో అమలు చేసి చూపించారు జగన్.

ఆ ఆలోచన బాబుదట….

గ్రామ సచివాలయాల‌ ఆలోచన తనదేనని చంద్రబాబు ఇపుడు అంటున్నారు. తాను 2003లో దీనికి శ్రీకారం చుట్టానని చెబుతున్నారు. మరి అది కనుక చేస్తే మీడియాలో వచ్చేది కదా. పైగా చంద్రబాబు నిన్నటివరకూ గ్రామ సచివాలయ వ్యవస్థపైన ఘాటైన విమర్శలు చేశారు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇప్పించుకునేందుకే పెట్టారని కూడా కామెంట్స్ చేశారు. ఇక ఇపుడు తీరా దేశం మొత్తం దీని గురించి చర్చించ‌డం, ఈ కాన్సెప్ట్ కి ఆదరణ లభించడంతో తనదే ఈ ఆలోచన అంటున్నారు. మరి ఇన్నాళ్ళూ ఇది తన‌దేనని ఎందుకు చెప్పుకోలేకపోయారని వైసీపీ నేతలు అడిగితే మాత్రం తమ్ముళ్లకు జవాబు లేదు. అసలు సచివాలయం ఆలోచన మాదేనని మొదట అన్నది టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజెంద్రప్రసాద్. 2000లో చంద్రబాబు ఈ ఆలోచన చేశారని ఆయన చెబుతున్నారు. 2003లో తాను గ్రామసచివాలయాలు పెట్టానని బాబు అంటున్నారు. మరి ఈ ఇద్దరి మాటలకే పొంతన‌ లేదంటే టీడీపీ కావాలనే రచ్చ చేస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా గ్రామ సచివాలయాల‌కు ఆదరణ పెరిగితే మాదేనని చెప్పుకోవడం బాగులేకపోతే మేము ఇలా చేయలేదని చెప్పుకోవడానికి టీడీపీ తమ్ముళ్ళు ఈ కొత్త ఎత్తుగడ వేశారని అంటున్నారు.

Tags:    

Similar News