లాజిక్కే గా? ఓటమి లగయితూ అంతేనా?

ఆయన జాతీయ అధ్యక్షుడు. ఘనమైన తెలుగుదేశం పార్టీకి నలభయ్యేళ్ళుగా అన్ని విధాలుగా సత్తువను అందిస్తున్న నేత. చంద్రబాబు ముమ్మారు ముఖ్యమంత్రి, ఇక ప్రతిపక్ష నాయకుడిగా కూడా అదే [more]

Update: 2020-04-13 00:30 GMT

ఆయన జాతీయ అధ్యక్షుడు. ఘనమైన తెలుగుదేశం పార్టీకి నలభయ్యేళ్ళుగా అన్ని విధాలుగా సత్తువను అందిస్తున్న నేత. చంద్రబాబు ముమ్మారు ముఖ్యమంత్రి, ఇక ప్రతిపక్ష నాయకుడిగా కూడా అదే రికార్డు ఉంది. ఇన్ని ఉన్న చంద్రబాబు చూపు మాత్రం ఏపీలో జగన్ చుట్టూనే తిరుగుతోంది. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయినది లగాయితూ బాబు ఆంధ్రాను పట్టుకుని అసలు వదలడంలేదు. దేశం ఏమైపోతేనేం. ఆ మాటకు వస్తే ప్రపంచం ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో నా కుర్చీ లాగేసిన జగనే టార్గెట్ అంటున్నారు చంద్రబాబు. లేకపోతే బాబు కరోనా వైరస్ విషయంలో పుంఖానుపుంఖాలుగా లేఖలను జగన్ కే రాస్తున్నారు. జగన్ నే విమర్శిస్తున్నారు. జగన్ నే అయిదు వేల రూపాయల సాయం పేదలకు చేయమంటున్నారు. ఏపీలోనే కరోనా కేసులు ఎక్కువై పోయాయని బాబు బెంబేలెత్తుతున్నారు. జగన్ సర్కార్ అన్ని విధాలుగా ఫెయిల్ అంటూ దారుణమైన ముద్ర కొట్టేస్తున్నారు.

కేసీఆర్ అంటే…?

అదేంటో 2015 నుంచే కేసీఆర్ ఊసే చంద్రబాబు ఎత్తడం మానుకున్నారు. ఓటుకు నోటు కేసు తరువాత హైదరాబాద్ వచ్చినా గుట్టుగానే ఉంటున్నారు. తనకేం పట్టనట్లుగా కూడా పోతున్నారు. నిజానికి లాక్ డౌన్ పీరియడ్ లో చంద్రబాబు హైదరాబాద్ లోనే కాపురం ఉంటున్నారు. ఆయనకు ఏపీ నుంచి సమాచారం టీవీలు, తమ్ముళ్ళ ద్వారా తెలిస్తే హైదరాబాద్ లో మాత్రం కళ్ళు పెట్టి వాస్తవాలను చూడగలుగుతున్నారు. కరోనా వైరస్ విషయంలో అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలే తట్టుకోలేని స్థితి. అందువల్ల ఇక్కడ మన పాలకులు ఏం చేశారన్నది నిజానికి చాలా చిన్న విషయంగానే చూడాలి. ఇక కరోనా ఆర్ధిక సాయంగా కేసీఆర్ కేవలం 1500 రూపాయలు మాత్రమే పేదలకు ఇస్తున్నాడు. అదే టైంలో అక్కడ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే కోటి మందికి పైగా జనం జీవిస్తున్న పరిస్థితి. పేదల బస్తీలు, వారి కడగండ్లూ అన్ని చోట్లా ఉన్నట్లుగానే అక్కడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి కేసీఆర్ కి ఒక్క లేఖ కూడా రాసిన పాపాన చంద్రబాబు పోలేదుగా. కనీసం సలహా సూచనలు అయినా ఇవ్వలేదుగా. ఎందుకంటే కేసీఆర్ అంటే బాబుకు భయం అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

మోడీ అంతేగా?

ఇక మోడీ చేయి ఏమైనా పెద్దదిగా చంద్రబాబుకు కనిపిస్తోందా. పేదలకు కేవలం అయిదు వందల రూపాయలు మాత్రమే జన ధన్ ఖాతాలో వేసి కేంద్రం చేతులు దులుపుకుంది. అది కూడా ఖాతా ఉన్న వారికే వర్తిస్తుంది. మరి కేంద్ర ప్యాకేజి మీద భేష్ అన్న చంద్రబాబు అందరి కంటే ముందే జగన్ ఏపీలోని లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు వేయి రూపాయిలు ఇస్తున్నట్లు ప్రకటించడమే కాదు. అందరి కంటే తొందరగానే ఆ డబ్బుని వారి ఇంట్లోకి చేర్చాడు. అయినా చంద్రబాబు నస పెట్టేస్తున్నారుగా. అయిదువేల రూపాయలు సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారుగా. ఏం బాబుకు తెలియదా ఏపీ అప్పుల కుప్ప అని. అందులో తన వాటావే తొంబై శాతం ఉందని, అంతగా ఏపీలోని పేదల పట్ల బాబుకు జాలి, ప్రేమా ఉంటే మోడీని అడిగి ఏపీకి ప్రత్యేక అర్ధిక ప్యాకేజి వచ్చేలా చూడవచ్చుగా. ఆ దిశగా కేంద్రానికి లేఖ అయినా రాయవచ్చుగా. ఆ పని మాత్రం చేయరు. కానీ జగన్ ని మాత్రం మూలన ఉన్న నిధులు తవ్వి తీసి మరీ పంచిపెట్టమంటారు. ఇక్కడే చంద్రబాబు మార్క్ రాజకీయం అర్ధమైపోవడంలేదూ.

చెప్పేసుకున్నారా…?

ఏపీలో లేకపోయినా ఏపీ గురించే మాట్లాడుతున్న చంద్రబాబు తెలంగాణాలో తన పార్టీ శాఖ ఉందని మరచిపోయారా అంటున్నారు వైసీసీ నేతలు. కేసీయాఆర్ని అడిగే దమ్మూ ధైర్యం చంద్రబాబుకు అసలు లేవని, ఆయనకు భయమని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఏపీ వరకే తాను నాయకుడిని అని బాబు చెప్పేసుకున్నాక ఇక జాతీయ అధ్యక్షుడు అన్న ట్యాగ్ ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయినా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చూసుకుంటే నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్కో చోటా ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవాలి. కానీ బాబు పార్టీకి తెలంగాణాలోనే దిక్కు లేదు అంటున్నారు వైసీపీ నేతలు. ఇపుడు చంద్రబాబు కూడా తాను లోకల్ లీడర్నేనని చెప్పేసుకున్నారని, ఇక టీడీపీ నేతలు మాది జాతీయ పార్టీ అని ప్రగల్బాలు పలకడం మానేసి గమ్మునుంటే మేలు అంటున్నారు అంబటి లాంటి వారు. మొత్తానికి పాయింట్ బాగానే లాగి చంద్రబాబు మైండ్ బ్లాంక్ చేశారుగా.

Tags:    

Similar News