బ్రాండ్ బాబు ఇక అక్కడ నీళ్లు వదిలేశారు

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని చంద్రబాబు ఇప్పుడు స్వయంగా రుజువు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ. నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉందని [more]

Update: 2020-04-12 09:30 GMT

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని చంద్రబాబు ఇప్పుడు స్వయంగా రుజువు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ. నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉందని ిప్పటికీ చంద్రబాబు చెబుతూ ఉంటారు. ఆ పార్టీకి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు కూడా. రెండు రాష్ట్రాలకు ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులను నియమించి రాజకీయాలను కొనసాగిస్తున్నారు చంద్రబాబు. అయితే ఏపీలో ఓటమి పాలయిన తర్వాత చంద్రబాబు తెలంగాణను పూర్తిగా వదిలేసినట్లే కన్పిస్తుంది.

అధికారంలో ఉన్నప్పుడు కూడా….

ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణ టీడీపీని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అధికారంలో ఉండటంతో ఆర్థిక సహకారం అందించేవారు. దీంతో పార్టీ నేతలు కార్యక్రమాలను చేసేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓటమి పాలయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేదు. ఇందుకు అప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతుండటం కారణమని చెప్పుకొచ్చారు.

పూర్వ వైభవం తెస్తానని……

కానీ ఇప్పుడు ఏపీలో అధికారంలో కోల్పోవడంతో తాను తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం తెస్తానని చంద్రబాబు పదే పదే చెప్పారు. ప్రతి శని, ఆదివారాల్లో పార్టీ నేతలతో సమావేశమవుతానని చెప్పారు. అయినా ఇప్పుడు వాటికి కూడా చంద్రబాబు పూర్తిగా తెరదించేశారు. అసలు తెలంగాణలో టీడీపీ ఉందా? లేదా? అన్న పరిస్థితికి వచ్చింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలంగాణలో ఏ పార్టీ ధైర్యం చేయడం లేదు. ఇందుకు కారణం ఆంధ్ర పార్టీగా ముద్రపడటమే.

తెలంగాణ జోలికి వెళ్లకుండా…..

ఇవన్నీ పక్కనపెడితే తెలంగాణలో కొద్దో గొప్పో పార్టీని బతికించుకుందామనుకున్న ప్రయత్నాలకు పూర్తిగా చంద్రబాబు చెక్ పెట్టేసినట్లే కన్పిస్తుంది. కరోనా సమయంలో తెలంగాణలో ఉన్న చంద్రబాబు అక్కడి విషయాలను పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా టెస్ట్ లు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. పేదలకు కేసీఆర్ రూ.1500 లు ఇచ్చారు. కానీ ఇక్కడి విషయాలను పట్టించుకోకుండా చంద్రబాబు ఏపీ సీఎంకు, గవర్నర్ లకు మాత్రమే లేఖలు రాస్తున్నారు. తెలంగాణ విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణ పార్టీని పూర్తిగా వదిలేసినట్లేనన్నది స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News