అందరికీ ఆయనే బాస్ అట..?

అదేంటో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా కంటే విపక్షాలకు బిగ్ బాస్ గా కనిపిస్తున్నట్లుంది. అదే విపక్ష పార్టీలకు ఆయన యజమానిగా ఉంటున్నారన్నది విజయసాయిరెడ్డి [more]

Update: 2020-04-12 08:00 GMT

అదేంటో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా కంటే విపక్షాలకు బిగ్ బాస్ గా కనిపిస్తున్నట్లుంది. అదే విపక్ష పార్టీలకు ఆయన యజమానిగా ఉంటున్నారన్నది విజయసాయిరెడ్డి సెటైరికల్ విమర్శ. ఇంతవరకూ జనసేనాని పవన్ కళ్యాణ్ కి మాత్రమే చంద్రబాబు యజమాని అంటూ ట్విట్టర్ ద్వారా విజయసాయి రోజూ ట్వీటేవారు. పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ అంటూ వైసీపీ నేతలు కూడా గట్టిగా విరుచుకుపడేవారు కూడా. పవన్ తన యజమాని చెప్పిన ప్రకారం నటిస్తాడని, ఆయన ఏం చెబితే అలా నడుస్తాడని విజయసాయిరెడ్డి పలు సదర్భాల్లో ఆరోపిస్తూ వచ్చారు. ఇపుడు మరో ఇద్దరి విపక్ష నేతలకు కూడా చంద్రబాబుని యజమానిని చేసేశారు. ఆ ఇద్దరూ ఒకరి సిధ్ధాంతాల పొడ మరొకరు గిట్టని వారు కావడం చిత్రమే. కానీ ఇలా భిన్నమైన భావజాలం ఉన్న వారు సైతం చంద్రబాబు మాటే మాకు బాట అంటున్నారంటే ఇదేదో చంద్రబాబు రాజకీయ వ్యూహమేనని విజయసాయి భావనలా ఉంది.

కన్నా అలా…

బీజేపీ అధినేత కన్నా లక్ష్మీనారాయణ ఇంటి మీద అప్పట్లో టీడీపీ మనుషులు దాడి చేశారు. ఆయన్ని జగన్ జేబులో బొమ్మని కూడా నాడు పసుపు పార్టీ తమ్ముళ్ళు హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఎన్నికల తరువాత జగన్ అధికారంలోకి రావడంతో కన్నా లక్ష్మీనారాయణ జగన్ మీద దారుణమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. సహజంగానే ఇది వైసీపీ నేతలకు ఇబ్బంది కలిగిస్తోంది. దాంతో వారు కన్నాను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అచ్చం చంద్రబాబు భాషనే కన్నా వాడుతున్నారని కూడా అంటున్నారు. ఇపుడు విజయసాయిరెడ్డి కాస్తా ముందుకెళ్ళి కన్నాకు చంద్రబాబు బాస్ అంటున్నారు. బాస్ ఏది చెబితే అది చేయడం కన్నా విధి అంటూ వెటకారం ఆడుతున్నారు. టీడీపీ అనుకున్నది బీజేపీ తరఫున కన్నా చేస్తూ ఏపీలో ఆ పార్టీ పరువు తీస్తున్నారని కూడా అంటున్నారు.

ఇది విడ్డూరమే….

వామపక్షాల చరిత్ర చూస్తే ఎవరికైనా ఈ ఆరోపణ వింతా, విడ్డూరంగా ఉంటుంది. కానీ జరుగుతున్న పరిణామాలు చూసిన వారికి మాత్రం నిజమేనా అనిపిస్తుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విషయం తీసుకుంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ మాదిరిగానే జగన్ మీద ఏ రోజూ సానుకూలంగా మాట్లాడింది లేదు. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నా కూడా జగన్ నే ఎక్కువగా రామక్రిష్ణ విమర్శించేవారు. ఇపుడు ఎటూ జగన్ పవర్లో ఉన్నారు కాబట్టి విమర్శల జోరు మరింత పెంచారు. పైగా ఆయన వామపక్ష భావజాలం కంటే కూడా బూర్జువా పార్టీల పద్ధతిలో మాట్లాడడమే విచిత్రం. పేదలకు వేయి రూపాయలు ప్రభుత్వం సాయం చేస్తూంటే దాని మీద కూడా ఎన్నికల కమిషన్ కి లేఖ రాస్తారా అని విజయసాయిరెడ్డి సీపీఐ నేత మీద విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు యజమానిగా చెబితే ఈయన చేస్తున్నారా అని మండిపడ్డారు.

రింగ్ మాస్టార్ గా…..

మొత్తానికి ఏపీలో రింగ్ మాస్టార్ అవతారంలో చంద్రబాబు ఉన్నారని వైసీపీ అంటోందన్నమాట. చంద్రబాబు ఏది చెబితే అది చేయడమే విపక్షాల పనిగా ఉందంటే అంతవరకూ బాబు గ్రేటే. కరడు కట్టిన వామపక్షాలను, బీజేపీని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని, ఇంకో వైపు కాంగ్రెస్, లోక్ సత్తా జయప్రకాష్ ఇలా అందరినీ తన వైపునకు తిప్పుకున్న చంద్రబాబు జగన్ మీద బాగానే రాజకీయ యుధ్ధం చేస్తున్నట్లే లెక్క. ఈ విషయం గ్రహించిన వైసీపీ పెద్దలు కనీసం తమ వైపు ఒక్క విపక్ష నేతను కూడా తిప్పుకోకపోవడం రాజకీయంగా తప్పుడు వ్యూహమే. పది పార్టీలు ఉంటే ఒక్కరు కూడా వైసీపీని మెచ్చక పోవడం అంటే అది సిధ్ధాంతాల కంటే కూడా వ్యక్తిగత పోరాటంగా ఉందన్న అనుమానాలు ఉన్నాయి. అయినా సరే అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీ కొన్ని పార్టీలతోనైనా సఖ్యతగా మెలిగితే మంచిదేమో. లేకపోతే చంద్రబాబుకు టోటల్ గా అందరినీ అంటకట్టి ఆయన్ని మరింత బలోపేతం చేస్తే మాత్రం చివరికి పొలిటికల్ గా వైసీపీకే అది తిప్పికొడుతుందేమో విజయసాయిరెడ్డి మాస్టార్ చూడాలి మరి.

Tags:    

Similar News