జగన్ లెక్క తప్పిందా..? బాబు ఆలోచన అదిరిందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలన్నీ పక్కాగా ఉంటాయి. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ఆయన ఏ అడుగైనా వేస్తారు. అందుకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు. [more]

Update: 2020-04-06 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలన్నీ పక్కాగా ఉంటాయి. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ఆయన ఏ అడుగైనా వేస్తారు. అందుకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు. జగన్ వేస్తున్న ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలించి ఆయన స్టేట్ మెంట్ ఇస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులను మచ్చిక చేసుకునే పనిలో చంద్రబాబు పడినట్లే కన్పిస్తుంది. జగన్ ప్రభుత్వ వేతనాలను వాయిదా పద్ధతిలో చెల్లించడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు.

ప్రభుత్వోద్యోగులే కీలకం…

నిజానికి ఏ పార్టీ విజయం సాధించాలన్నా ప్రభుత్వ ఉద్యోగులే కీలకమవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకమైతే అధికారంలో ఉన్న పార్టీకి ఇబ్బందులు తప్పవు. గతంలో చంద్రబాబు కూడా దీనిని చవిచూశారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై ప్రభుత్వోద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నారని మాట వాస్తవం. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రధానంగా వారికి పీఆర్సీని అమలుచేయకపోవడం ఒకటైతే, తాజాగా వేతనాలను వాయిదా వేయడం కూడా అసంతృప్తికి కారణమని చెప్పక తప్పదు.

బయటకు ఒకలా….

బయటకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తాము సహకరిస్తామని చెప్పినా తమ ఖాతాలో పడిన సొమ్మును చూసుకుని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు మూడు రాజధానుల అంశం కూడా ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా అమరావతి నుంచి సచివాలయ ఉద్యోగులు మళ్లీ విశాఖకు తరలి వెళ్లడానికి అధిక శాతం మంది సుముఖంగా లేరు. అయితే ప్రభుత్వానికి భయపడి బయటపడటం లేదు. దీనికి తోడు ప్రధానంగా ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. రాజధాని తరలింపును కూడా చంద్రబాబు వ్యతిరేకించారు.

ఉపాధ్యాయులయితే…..?

ఉపాధ్యాయులు వైరస్ కంటే వేగంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రచారం చేస్తారన్న నానుడి ఉంది. వీరికి ఇప్పుడు కరోనా డ్యూటీలు వేయడం కూడా అసంతృప్తికి దారి తీసింది. అంతేకాదు స్కూళ్లకు సెలవులు ప్రకటించినా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం వారి ఇళ్లకు చేరవేయడం కష్టంగా మారింది. అనేక మంది ఉపాధ్యాయులు బాహాటంగా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు ఇప్పుడు కరోనా కార్యకలాపాల్లోనూ ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేయడంతో వారిలో మరింత అసహనం పెరుగుతోంది. ప్రమాదకమైన పనుల్లో తమను వినియోగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిని చంద్రబాబు చక్కగా వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా పార్టీ ఉంటుందని ఆయన ప్రకటించారు. మొత్తం మీద జగన్ ఇచ్చే ప్రతి అవకాశాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు.

Tags:    

Similar News