దాచితే ఎవరికి నష్టం? బయటుండి బురద జల్లడమేంటి?

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను చుట్టేస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య చూస్తుంటేనే [more]

Update: 2020-04-03 06:30 GMT

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను చుట్టేస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య చూస్తుంటేనే టెన్షన్ పుడుతుంది. ఈ దశలో ప్రజలకు ధైర్యం చెప్పి, ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు బురద జల్లే కార్యక్రమాన్ని మాత్రం వదలలేదు. కరోనా వైరస్ బాధితుల సంఖ్యను ప్రభుత్వం దాచి పెడుతుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

దాచిపెడితే…?

నిజానికి దాచిపెడితే ఎవరికి నష్టం? అన్నది చంద్రబాబు పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ సంక్రమించిన రోగి బయట ఉంటే వందలాది మందికి దానిని అంటించే వీలుంది. ఇది ఇతర దేశాల్లో మనం చూస్తున్నాం. కరోనా వ్యాధితో చనిపోయినా ఆ మృతదేహాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఖననం చేయాల్సి ఉంటుంది. అంత్యక్రియల్లో సయితం అన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ిఅయితే చంద్రబాబు మాత్రం పాజిటివ్ కేసులను, చనిపోయిన వారి వివరాలను ప్రభుత్వం దాచిపెడుతుందని ఆరోపణలు చేస్తున్నారు.

వారి వల్లనే కేసులు….

వాస్తవానికి ఢిల్లీలోని మర్కజ్ మసీదు వ్యవహారంతోనే ఏపీలో కరోనా పాజిటివ్ సంఖ్య పెరిగింది. అప్పటి వరకూ కరోనా కంట్రోల్ లోనే ఉంది. అయితే వీరిని వెతికిపట్టుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. కరోనా పాజిటివ్ కేేసుల సంఖ్యను దాచిపెడితే ఎవరికి ప్రయోజనమన్న చర్చ జరుగుతోంది. అమెరికా లాంటి దేశంలోనే లక్షలాది మంది దీని బారిన పడ్డారు. వేలాది మంది మృత్యువాత పడ్డారు. కరోనా వ్యాప్తి చెందినా అది ప్రభుత్వ వైఫల్యం కింద వస్తుందా? లేక ప్రజల నిర్లక్ష్యం వల్లనేనా? అన్నది చూడాల్సి ఉంది.

సహకారం అందించాల్సిన సమయంలో….

దీనిని వ్యాప్తిచెందకుండా ఉండాలంటే కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. కరోనాతో చనిపోయిన వారికి ఎటువంటి నష్టపరహారమూ ప్రభుత్వాలు చెల్లించడంలేదు. మరి ప్రభుత్వాలు ఎందుకు దాచిపెడతాయన్నది ప్రశ్న. కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వ ప్రయత్నాలకు కుదిరితే సహకారం అందించాల్సిందిపోయి ఇప్పుడు కూడా రాజకీయాలు చేయడం చంద్రబాబుకు తగదన్న కామెంట్స్ బాగా విన్పిస్తున్నాయి. బయట కూర్చుని బురద జల్లడమేంటని వైసీపీ చంద్రబాబుపై మండిపడుతోంది.

Tags:    

Similar News