అది చేస్తేనే…అందలమట… లేకుంటే లేదట

రాజ‌కీయాల్లో పొత్తులు మామూలే. అవ‌స‌రార్ధం కొన్ని.. ఏదో ఏరు దాటేందుకు కొన్ని అన్నట్టుగా రాజ‌కీయాల్లో కీల‌క పార్టీల మ‌ధ్య పొత్తులు కామ‌న్‌. ఇక‌ టీడీపీ పుట్టి పెరిగిన [more]

Update: 2020-03-31 15:30 GMT

రాజ‌కీయాల్లో పొత్తులు మామూలే. అవ‌స‌రార్ధం కొన్ని.. ఏదో ఏరు దాటేందుకు కొన్ని అన్నట్టుగా రాజ‌కీయాల్లో కీల‌క పార్టీల మ‌ధ్య పొత్తులు కామ‌న్‌. ఇక‌ టీడీపీ పుట్టి పెరిగిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం గ‌త ఏడాది జ‌రిగిన జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల్లో మాత్రమే ఒంట‌రిగా పోటీ చేసింది. దీనికి ముందు ఎప్పుడు కూడా పార్టీ ఏదో ఒక పార్టీతొ పొత్తు పెట్టుకుని ముందుకు సాగింది. ఈ విష‌యంలో చంద్రబాబు ది రికార్డు. ఆయ‌న పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉంటే.. అది వైసీపీ ఒక్కటే. కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల‌పై తెలుగు వారి ఆత్మగౌర‌వాన్ని నిల‌బెట్టేందుకు అన్నగారు స్థాపించిన పార్టీని 2018 డిసెంబ‌రులో జ‌రిగిన తెలంగాణ‌ ఎన్నిక‌ల్లో అదే కాంగ్రెస్‌తో పొత్తుకుసిద్ధప‌డ్డారు.

కాంగ్రెస్ తో పొత్తుపై….

దీనిపై తీవ్రమైన విమ‌ర్శలు వ‌చ్చాయి. అయినా చంద్రబాబు ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారో ఆ ల‌క్ష్యాన్ని తుంగ‌లో తొక్కేసి మ‌రీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్రజ‌లు కాంగ్రెస్ + టీడీపీ కూట‌మిని చిత్తుగా ఓడించారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే కాంగ్రెస్‌తో తెగ‌తెంపులు చేసుకున్నారు. ఇక‌, క‌మ్యూనిస్టుల‌తో టీడీపీ చెలిమి.. ఓ పెద్ద హిస్టరీ! గ‌తంలో అన్నగారి హ‌యాం నుంచి కూడా క‌మ్యూనిస్టుల‌తో చెలిమి సాగించిన తెలుగుదేశం.. అనేక సార్లు విడిపోవ‌డం క‌లిసిపోవ‌డం తెలిసిందే. 2014కు ముందు ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టుల‌తో చెలిమి చేసింది.

అంతకు ముందు బీజేపీతో….

దీనికి ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 1999, 2004 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆ త‌ర్వాత 2009లో ఆ పార్టీ నుంచి విడిపోయారు. మ‌ళ్లీ 2014 ఎన్నిక‌ల్లో క‌మ‌లంతో క‌లిసి పోటీ చేసింది. ఇక టీఆర్ఎస్‌తో సైతం చంద్రబాబు 2009 ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకున్నారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌ల్లో మాత్రం వ్యూహాత్మకంగా చంద్రబాబు ఒంట‌రిగా బ‌రిలో నిలిచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా త‌న‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆయ‌న ప్రయ‌త్నించారు. అయితే అది ఫెయిలైంది. ఇక‌, ఇలా పొత్తులు గురించి చెబితే. టీడీపీ కి చాలా హిస్టరీనే ఉంది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి స్థానిక ఎన్నిక‌ల్లో సీపీఐతో పొత్తు పెట్టుకుని చాలా చోట్ల ఆ పార్టీతో పొత్తు మెరుగైన ఫ‌లితాలు వ‌స్తా య‌న్న ధీమాతో ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో….

అయితే, ఈ రెండు పార్టీలు సీట్ల స‌ర్దుబాటు కార‌ణం.. ఉంద‌ని అంటున్నారు. మ‌రో కమ్యూనిస్టు పార్టీ సీపీఎంతో కూడా పొత్తుకు చంద్రబాబు ప్రయ‌త్నిస్తున్నార‌ట‌. కొన్ని చోట్ల స్థానిక నేత‌లు జ‌న‌సేన‌తో పొత్తుతో గోదావ‌రి జిల్లాల్లో పోటీకి దిగారు. మొత్తంగా చూస్తే.. బాబు పొలిటిక‌ల్ హిస్టరీలో పొత్తులే కుండా ప‌నిగ‌డిచిన ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే అదే సెంటిమెంట్‌తో మ‌ళ్లీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ పొత్తుకు రెడీ అవుతున్నార‌ని అంటున్నారు.

Tags:    

Similar News