అంతా ఆయనదేనట…ఇప్పుడు ఇదో ఫ్యాషనయిపోయిందిగా

స‌మ‌యం మ‌న‌కు అనుకూలంగా లేన‌ప్పుడు తాడు కూడా పామై క‌రిచిన చందంగా మారిపోయింది టీడీపీ అధినేత చంద్రబాబు ప‌రిస్థితి. 2014లో అప్రతిహ‌త విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన చంద్రబాబు [more]

Update: 2020-03-25 06:30 GMT

స‌మ‌యం మ‌న‌కు అనుకూలంగా లేన‌ప్పుడు తాడు కూడా పామై క‌రిచిన చందంగా మారిపోయింది టీడీపీ అధినేత చంద్రబాబు ప‌రిస్థితి. 2014లో అప్రతిహ‌త విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన చంద్రబాబు దీనినే రెండో సారీ ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నించారు. అయితే, అది సాధ్యం కాలేదు. దీంతో ప్రతిప‌క్షానికి ప‌రిమిత‌ మ‌య్యారు. రాజ‌కీయాల్లో ఇలాంటి ప‌రిణామాలు కామ‌న్‌. అయితే, అధికారంలో ఉండ‌గా బెల్లం చుట్టూ ఈగ‌లు చేరిన చందంగా చంద్రబాబు చుట్టూ చేరి భ‌జ‌న చేసిన నాయ‌కులు ఇప్పుడు ఆయ‌న అధికారం కోల్పోగానే స‌ర్దు కుంటున్నారు. పార్టీ నుంచి జంప్ చేస్తున్నారు.

పది నెలలు తిరక్క ముందే…?

దీంతో ఎన్నిక‌లు జ‌రిగిన నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేస్తే.. కేవలం ప‌ది మాసాల్లో టీడీపీ ప‌రిస్థితి దారుణంగానే త‌యారైంది. కీల‌క నాయ‌కులు వెళ్లిపోయారు. మ‌రికొంద‌రు మౌనం పాటిస్తున్నారు. ఇంకొంద‌రు ఎప్పుడు ఛాన్స్ వ‌స్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. దీంతో ఇప్పుడు విమ‌ర్శలు చేసే వారు పెరిగిపోయారు. చంద్రబాబు సీనియ‌ర్‌న‌ని చెప్పుకొంటాడు కానీ.. ఆయ‌న పార్టీని న‌డిపించ‌లేక పోతున్నారు. ఆయ‌న స‌ర్వీస్ అయిపోయింది. ఇక‌, ఆయ‌న వాన‌ప్రస్థానికి వెళ్లిపోవాల్సిందే. ఇలా అనేక మంది త‌మ‌కు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చినా….

కానీ, ఇక్కడే ఒక విష‌యం మరిచిపోతున్నారు. దివంగ‌త ఎన్టీఆర్ హ‌యాం కంటే కూడా చంద్రబాబు హ‌యాంలో టీడీపీలో నేత‌ల‌కు స్వేచ్ఛనిచ్చారు బాబు. అన్నగారి హ‌యాంలో ఒసారి పార్టీ నుంచి బ‌య‌ట‌కువెళ్తే.. శాశ్వతంగా త‌లుపులు మూసేశారు. అదేవిధంగా అన్నగారిని విమ‌ర్శించేందుకు కూడా సాహ‌సించేవారు కాదు. కానీ, చంద్రబాబు అలా కాకుండా స్వతంత్రం ఇచ్చారు. అయితే, ఈ స్వతంత్రాన్ని నాయ‌కులు త‌మ స్వార్ధం కోసం వినియోగించుకుంటార‌ని ఆయ‌న భావించ‌లేదు. పార్టీ గెలిస్తే.. ఆయ‌న ఒక్కరే అనుభ‌వించ‌డం లేద‌నే విష‌యాన్ని త‌మ్ముళ్లు గుర్తించ‌డం లేక‌పోవ‌డం ఆయ‌న త‌ప్పు కాదు.

అంతా ఆయన మీదనే…?

ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైనంత మాత్రాన.. పార్టీ పుంజుకోలేద‌ని ఎవ‌రూ చెప్పలేరు. సో.. చంద్రబాబుకే కాదు.. పార్టీలో నిల‌బ‌డ‌డం, పార్టీని నిల‌బెట్టడం అనేది ప్రతి ఒక్క టీడీపీ నేత బాధ్యత‌. అప్పుడు ప‌ద‌వులు అనుభ‌వించి ఇప్పుడు పార్టీ మారిపోతామంటే ప్రజ‌లు కూడా చూస్తూ ఊరుకోరు. గ‌తంలో పార్టీ మారిపోయిన వారిని ప్రజ‌లు ఎలా ప‌క్కన కూర్చోబెట్టారో తెలుసుకుంటే బెట‌ర్ అని సూచిస్తున్నారు టీడీపీ సానుభూతి ప‌రులు. ప్రతి విష‌యానికీ చంద్రబాబును త‌ప్పుప‌ట్టడం పెద్ద ఫ్యాష‌న్‌గా మారిపోయింద‌ని అంటున్నారు. ఎవ‌రికి వారు ఎక్కడిక‌క్కడ బ‌య‌ట‌కు వ‌చ్చి పార్టీ కోసం ప‌నిచేస్తే.. ఇలా ఉంటుందా ? అనిప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News