తాపత్రయం తప్ప…తాడో పేడో తేల్చుకోలేకపోతున్నారా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నా.. త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ముందుండే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో దాదాపు ఏడు నుంచి [more]

Update: 2020-03-26 00:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నా.. త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ముందుండే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది జిల్లాల్లో నాయ‌కుల మ‌ధ్య సాగుతున్న అంత‌ర్గత కుమ్ములాట‌ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటారా ? స్థానిక ఎన్నిక‌ల స‌మ‌రంలో త‌న పార్టీ విజ‌యం సాధించేలా ప్రస్తుత వైసీపీ వివాదాల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటారా ? ఇప్పుడు రాజ‌కీయ మేధావులు ఈ విష‌యంపై నే దృష్టి పెట్టారు. శ్రీకాకుళం నుంచి క‌డప వ‌ర‌కు రెండు మూడు జిల్లాలు మిన‌హా అన్ని చోట్లా అధికార పార్టీలో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగుతోంది.

ఎవరికి వారే…..

ఎమ్మెల్యేల‌పై మంత్రులు, మంత్రుల‌పై ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ఇంచార్జ్‌లు ఇలా ఒక రేంజ్ లో వైసీపీలో నాయ‌కుల మ‌ధ్య కుమ్ములాట‌లు చోటు చేసుకున్నాయి. నామినేటెడ్ ప‌దవుల పంప‌కాల స‌మయం నుంచి ప్రారంభ‌మైన ఈ వివాదాలు ఇప్పటికీస్థానిక సంస్థల ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా కొన‌సాగుతున్నాయి. స్థానిక ఎన్నిక‌ల్లో తాము సిఫార‌సు చేసిన వారికి టికెట్ ఇవ్వలేద‌ని ఎమ్మెల్యేలే ఆవేద‌న చెందుతున్నా రు. ఈ క్రమంలో చాలా జిల్లాల్లో నేత‌ల మ‌ధ్య అంత‌ర్గత పోరు జోరుగా సాగుతోంది. దీని ప్రభావం ఎన్నిక‌ల‌పై కూడా ప‌డుతోంది. ఎవ‌రికి వారే య‌మునా తీరే అనే విధంగా నాయ‌కుల ప్రచారం సాగుతోంది.

సానుకూలంగా…..

కొన్ని కోన్ని జిల్లాల్లో అయితే, మేం గెలిస్తే.. చాలు అనే రేంజ్‌లోనూ ప్రచారం సాగుతోంది. అంటే ప‌క్కవారు ఓడినా ఫ‌ర్వాలేదు అని నాయ‌కులు అనుకుంటున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో వైసీపీ లోతుపాతులను గుర్తించి ఆయా అవ‌కాశాల‌ను త‌మ‌కు అవ‌కాశంగా మ‌లుచుకోవ‌డం ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ దూకుడుగా ముందుకు సాగుతోందా ? ఎక్కడిక‌క్కడ ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటోందా ? అంటే లేద‌నే చెప్పాలి. స్థానిక ఎన్నిక‌ల్లో అక్కడ‌క్కడా జ‌రుగుతున్న వివాదాల‌ను పెద్దవిగా చేసి చూపించేందుకు చంద్రబాబు తాప‌త్రయ ప‌డుతున్నారు త‌ప్పితే చాలా జిల్లాల్లో పార్టీకి ఉన్న అవ‌కాశాల‌ను మాత్రం ఆయ‌న బేరీజు వేసుకోవ‌డం లేద‌నే అంటున్నారు.

వ్యూహం లేకపోవడమేనా?

ఇటు కొన్ని చోట్ల వైసీపీ నేత‌ల‌ను ఢీకొట్టి నామినేష‌న్ వేసేందుకే భ‌య‌ప‌డుతున్నారు. గుంటూరు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లోనే రెండు జ‌డ్పీటీసీల‌ను వ‌దులుకుంది. ఇక రాయ‌ల‌సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏ నేత ఎప్పుడు పార్టీ వీడ‌తారో ? బాబుకు ఎలా షాక్ ఇస్తారో ? తెలియ‌ని ప‌రిస్థితి. సో.. మొత్తంగా చూస్తే.. వైసీపీలో ఆధిప‌త్య పోరు సాగుతుంటే.. టీడీపీలో వ్యూహంలేక‌పోవ‌డం ఇరు పార్టీల‌ను కూడా ఇబ్బంది పెడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News