రివర్స్ లో వెన్నుపోటు సినిమా చూపిస్తున్నారే?

చంద్రబాబు పక్కన అపుడెవరున్నారు, ఇపుడేవరున్నారు. ఇది చాలు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ బేలగా ఎందుకు మారిపోయారో చెప్పడానికి. చంద్రబాబు అధికారంలో ఉంటే చండశాసనుడు, ఆయన కన్నెర్ర చేస్తే [more]

Update: 2020-03-22 00:30 GMT

చంద్రబాబు పక్కన అపుడెవరున్నారు, ఇపుడేవరున్నారు. ఇది చాలు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ బేలగా ఎందుకు మారిపోయారో చెప్పడానికి. చంద్రబాబు అధికారంలో ఉంటే చండశాసనుడు, ఆయన కన్నెర్ర చేస్తే చాలు మంత్రులే భయపడేవారు. ఇపుడు ఆ సీన్ ఉందా? కనీసం ఎమ్మెల్యేలు అయినా చంద్రబాబు పక్కన కనిపిస్తున్నారా. చంద్రబాబు పక్కన ఇపుడు మాజీ ఉద్యోగ సంఘాల నేత, తాజా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, వర్ల రామయ్య వంటి వారే కనిపిస్తున్నారు. టీడీపీ అంటే ఎలాంటి పార్టీ, అతిరధ మహారధులు ఎందరో ఆ పార్టీ నుంచే తయారు చేయబడ్డారు. ఒక విధంగా చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే టీడీపీ లీడర్లను ప్రొడక్ట్ చేసే ఫ్యాక్టరీ. అటువంటి టీడీపీకి ఇపుడు ఏం గతి పట్టిందని నిజమైన అభిమానులు రోదిస్తున్నారంటే నిజమే కదా.

నాటి మంత్రులేమయ్యారో…?

చంద్రబాబు కంటే ముందే వేగంగా స్పందిస్తూ నాడు టీవీల్లో, మీడియాలో కనిపించే మంత్రులు ఏమయ్యారో. తమకు తిరుగులేదని జబ్బలు చరచిన వారంతా ఇపుడు ఏ గూట్లో దాక్కున్నారో. వారిని ఏ ప్రలోభాలు ఆపుతున్నాయో. మరే భయాలు అడ్డుచెబుతున్నాయో. లేక పలాయనవాదంతో తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చున్నారో తెలియదు కానీ టీడీపీలో సీనియర్లే లేనట్లుగా చంద్రబాబు ఒక్కరే అయిపోయారు. ఒంటరి పోరు చేస్తున్నారు. నిజానికి స్థానిక ఎన్నికలు ఇవి. చంద్రబాబు పాత్ర తక్కువగా ఉండాలి. నాయకులు ఎక్కడికక్కడ రంగంలోకి దూకాలి. కానీ ఇక్కడ జాతీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు వీధుల్లోకి వస్తున్నారు. మాజీ మంత్రులు దర్జాగా ఇళ్ళలో టైం పాస్ చేస్తున్నారు.

పార్టీ పట్టదా…?

నిజానికి చంద్రబాబు ఆవేదన పార్టీ తమ్ముళ్ళకు లేకపోయే. ఎందుకంటే ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో కూడా పార్టీ చతికిలపడితే సైకిల్ కధ ముగిసినట్లే. వైసీపీ అందుకోసమే ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఒక్కో ఎమ్మెల్యేనూ దగ్గరకు తీస్తున్న వైసీపీ ఏకమొత్తంగా టీడీపీ ఎమ్మెల్యేలకు ద్వారాలు తెరుస్తుంది. ఏ ఫిరాయింపుల వేటు పడకుండా ఏకంగా టీడీఎల్పీని విలీనం చేసుకుంటుంది. అదే చంద్రబాబును భయపెడుతోంది. అపుడు పార్టీయే లేని చోట మాజీలు, నాయకులు ఎక్కడ తలదాచుకుంటారో వారికైనా అర్ధమవుతోందా?

చాప చుట్టేశారు……

నిజానికి టీడీపీ ఓడిన దగ్గర నుంచి పెద్ద నాయకుల్లో చలనం లేదు. పార్టీ అధికారంలో ఉండగా అన్నీ అనుభవించిన నాయకులు పార్టీ ముఖం చూడలేదు. ఓ వైపు వైసీపీ బంపర్ మెజారిటీతో దూకుడుగా ఉంటే కనీసం స్పందించేందుకు కూడా తమ్ముళ్ళకు తీరిక లేకుండా పోయింది. పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మీద భౌతిక దాడి జరిగితే కనీసం ఇరుగు పొరుగు జిల్లాలకు చెందిన మాజీ మంత్రులైనా నోరు విప్పడంలేదు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ ఇక బతకదు అని వారు అనుకుంటున్నారులా ఉంది. నిజానికి బ‌తుకుతుందో లేదో జనం నిర్ణయిస్తారు కానీ ముందే పార్టీని చంపేస్తున్నారు. ఈ తమ్ముళ్ళ వెన్నుపోటే చంద్రబాబుని ఇంకా బాధపెడుతున్నట్లుగా ఉంది.

Tags:    

Similar News